అక్రమ ఇసుకను తరలిస్తే భారీ జరిమాన తప్పదు.

ఎమ్మార్వో ప్రభాకర్.

కోటగిరి సెప్టెంబర్ 2 జనం సాక్షి:-ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమ ఇసుకను తరలిస్తే భారీ జరిమానాలతో పాటుగా చట్టపరమైన చర్యలు తప్పవని కోటగిరి ఎమ్మార్వో ప్రభాకర్ పేర్కొన్నారు.శనివారం రోజున కోటగిరి ఎమ్మార్వో మండలంలోని పలు గ్రామాల లో స్పెషల్ కాంప్టెండ్ డే సందర్భంగా సందర్శిస్తున్న తరుణంలో పోతంగల్ మండల కేంద్రం నుండి అనుమతులు లేకుండా తరలిస్తున్న నాలుగు ఇసుక ట్రాక్టర్లను రెవెన్యూ సిబ్బంది ద్వారా పట్టుకుని తాహాసిల్దార్ కార్యాలయానికి తరలించారు.ఈ సందర్భంగా ఎమ్మార్వో తన కార్యాలయంలో మాట్లాడుతూ.అనుమతులు లేకుండా అక్రమ ఇసుకను తరలిస్తే భారీ జరిమానలతో పాటుగా చట్టపరమైన చర్యలు తప్ప వని హెచ్చరించారు.జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం ఇసుక ను తరలించాటానికి గ్రామ పంచాయతీలు,తహశీల్దార్, మండల పరిషత్తు అధికారు లకు ట్రాక్టర్ కు రూ.900 చెల్లిస్తే వేబిళ్ళు ఇస్తామని చెప్పారు. వేబిల్లులు లేకుండా ఇసుకను తరలించే ట్రాక్టర్లకు మొదటి పనిష్మెంట్ గా రూ”5వేల జరిమానా,రెండో సారి పట్టు బడితే రూ.10వేల జరిమానా, మూడో సారి పట్టుబడితే వాహనాలను సీజ్ చేయడం జరుగుతుందని హెచ్చరించారు. లారీల్లో ఇసుక తరలింపు కోసం జిల్లా మైనింగ్ కార్యాలయం నుంచి అనుమతులు పొందాలి లేదా వాహనాలను సీజ్ చేస్తామన్నారు.ప్రభుత్వ పాటశాల భవనాలు,డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి ఇందులో మినాహింపు ఉందని సూచించారు.

తాజావార్తలు