రొంపికుంటలో లేబర్ కార్డు సభ్యులకు ఆరోగ్య పరీక్షలు

జనంసాక్షి, కమాన్ పూర్ : పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండలం
రొంపికుంట గ్రామ పంచాయతీ ఆఫీస్ లో లేబర్ కార్డు సబ్యులకు కామనే సర్వీస్ సెంటర్ వైద్య బృందం ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. రాష్ట్ర ఆరోగ్యశాఖ ఆదేశాలతో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సహకారంతో సోమవారం రొంపికుంట గ్రామంలో లేబర్ కార్డు సబ్యులకు ఉదయం నుంచి సాయంత్రం వరకు కామన్ సర్వీస్ సెంటర్ వైద్య సిబ్బంది సుమారు ఇరవై ఐదు మంది సభ్యులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు.
గ్రామంలోని రెండు వందల యాభై నాలుగుమంది సభ్యులకు గాను మొదటి రోజు ఇరువై ఐదుమంది సభ్యులు ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ హెల్త్ క్యాంపు ద్వారా బిపి మధుమేహం (సుగర్) కిడ్నీ, కాలేయం, థైరాయిడ్ గ్రంథి, కాన్సర్ , మూత్ర పరీక్షలు సుమారు యాభై రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తారని లేబర్ కార్డు సభ్యులు ఈ రోజు రానివారు మంగళవారం కూడ వచ్చి ఆరోగ్య పరీక్షలు చేయించుకొని క్యాంపును సద్యినియోగం చేసుకోగలరని డా.అమూల్య తెలిపారు .ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కటుకం రవిందర్, కమాన్ పూర్ మండల వైస్ ఎం పి పి ఉప్పరి శ్రీనివాస్,ఉప సర్పంచ్ గుమ్మడి సతీష్.సామజిక కార్యకర్త కూచన మల్లయ్య ‘మహర్షి’ లేబర్ కార్డు సభ్యులు పాల్గొన్నారు.

తాజావార్తలు