మహిళలు మౌనం వీడండి నిర్భయంగా తమ పై జరిగే వేదింపులను పోలీస్ షీ టీమ్స్ కు తెలియజేయండి
జిల్లా ఎస్పీ శ్రీమతి కె. సృజన.
గద్వాల నడిగడ్డ, సెప్టెంబర్ 4 (జనం సాక్షి);
మహిళలు, యువతులు వేదింపులకు సంబందించి ఎలాంటి సమస్యలు ఉన్న మౌనం వీడి నిర్భయంగా పోలీస్ షి టీమ్స్ కు తెలియజేయాలని జిల్లా ఎస్పీ కె. సృజన తెలిపారు.
గద్వాల డి.ఎస్పీ.పి. వేంకటేశ్వర్లు పర్యవేక్షణలో నడిచే షీ టీమ్స్ పనితీరును గత నెలకు సంభందించిన వివరాలనూ ఒక ప్రకటన ద్వారా జిల్లా ఎస్పీ తెలియజేశారు.గత నెల రోజులకు సంబందించి 06 ఫిర్యాదులు అందగా అదుపులోకి తీసుకున్న ముగ్గురు ఆకతాయిలకు జోగుళాంబ గద్వాల షీ టీమ్స్, తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించడం జరిగిందనీ,
ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ఎక్కడైనా, ఎప్పుడైనా అమ్మాయిలు, మహిళలను వేధించే ఆకతాయిలకు జోగుళాంబ గద్వాల షీ టీమ్స్ పోలీసులు వారికి కళ్లెం వేస్తున్నారు అని తెలిపారు.జిల్లా లో బస్టాండ్‌లు, రైల్వే స్టేషన్లు, పాఠశాలలు, కాలేజీలు, బహిరంగ ప్రదేశాలలో మఫ్టీలో తిరుగుతూ డెకాయ్ ఆపరేషన్లు చేస్తున్నారనీ, మహిళలను వెంబడిస్తూ వేధించే పోకిరీల చేష్టలను సాక్ష్యాధారాలతో సహా పట్టుకొని న్యాయ స్థానంలో హాజరు పరుస్తున్నారనీ, తొలిసారి చేసిన తప్పిదానికి చిక్కిన పోకిరీలకైతే తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇస్తున్నారనీ, తప్పు పునరావృతమైతే కోర్టులో హాజరుపరిచి, రిమాండ్‌కు తరలిస్తున్నామన్నారు.గద్వాల ఉమెన్ సేఫ్టీ వింగ్, షి టీమ్స్ ఆధ్వర్యంలో ఈవ్ టీజర్లకు కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగింది. జోగుళాంబ గద్వాల పరిదిలో మహిళలను , యువతులను వేదింపులకు గురిచేస్తున్న ముగ్గురిని షీ టీమ్స్ వారు పట్టుకున్నారు. వారికి కుటుంబ సభ్యుల సమక్ష్యంలో కౌన్సెలింగ్ నిర్వహించడం జరిగిందనీ తెలిపారు. గత నెల ఆగస్టులో అందిన 06 ఫిర్యాదుల పై విచారణ చేపట్టి దర్యాప్తు పూర్తి చేశామన్నారు. అందిన పిర్యాదులలో ఫోన్ల ద్వారా వేదించినవి 4 , నెరుగా వేదించినవి 2, వాటిలో క్రిమినల్ కేసులు 2, పెట్టి కేసులు 2, కౌన్సెల్లింగ్ 2 కేసులు నమోదు చేశామన్నారు. షీ టీమ్స్ గద్వాల్ పట్టణం లోని బాలికల పాఠశాల, జూనియర్ కలశాల మొదలగు ఏరియాలో నిర్వహించి రోడ్డు మీద వెలుతున్న మహిళను, ఆడపిల్లలను వేదిస్తున్న , ఇబ్బందులకు గురిచెస్తున్న ముగురుని పోకిరిలను అదుపులోకి తీసుకొని వారిపై కేసులు నమోదు చేసి కౌన్సెలింగ్ చేయడం, జిల్లాలో 63 ప్రదేశాలలో హాట్స్పట్ లను గుర్తించి షి టీమ్స్ బృందాలు ఆ ఏరియాలలో తిరగడం కళాశాలలు , పాఠశాలలు , బస్ స్టాండ్ లు, రైల్వే స్టేషన్ ప్రదేశాలలో 22 అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని జిల్లా ఎస్పీ తెలిపారు.ఈ సంధర్బంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఆడవారికి ఎదురయ్యే భౌతిక పరమైన దాడులు, లైంగిక వేదింపులు, ప్రయాణ సమయాల్లో వేదింపులు వంటి ఇబ్బందుల నుంచి రక్షించేందుకు జోగుళాంబ గద్వాల పోలీసులు ఇరవై నాలుగు గంటలూ అందుబాటులో ఉంటున్నారని పేర్కొన్నారు. పురుషులు, సాటి ఆడవారి పట్ల బాధ్యతగా, మర్యాదగా నడుచుకోవాలని, వారికి అండగా నిలవాలని, పలు రకాల అవసరాలతో ఇంటి నుంచి బయటకు వచ్చే స్త్రీలకు ఎలాంటి ఇబ్బందులు కలిగించకూడదన్నారు. స్త్రీలను గౌరవించడం తమ వ్యక్తిత్వంలో భాగం కావాలని, ఆడవారిని ఇబ్బందులు పెట్టే వారిని ఉపేక్షించేది లేదని, అటువంటి వారి పట్ల కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ హెచ్చరించారు. మహిళలు వేదింపులకు గురి అయినప్పుడు వెంటనే షీ టీమ్స్ 8712670312 నెంబర్ ద్వారా సంప్రదించాలని తెలిపారు.