అంగన్వాడీ టీచర్లకు కనీస వేతనంగా 26 వేల రూపాయలు అందజేయాలి..
10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వాలి..
సంఘం మండలాధ్యక్షురాలు భారతి… శంకరపట్నం జనం సాక్షి సెప్టెంబర్ 4 :
అంగన్వాడి సెంటర్ లో టీచర్లుగా విధులు నిర్వహిస్తున్న అంగన్వాడీ టీచర్లకు కనీస వేతనంగా 26 వేల రూపాయలు అందజేసి ,ఉద్యోగ భద్రత కల్పించాలని, అంగన్వాడీ టీచర్ల సంఘం మండల అధ్యక్షురాలు దేవసాని భారతి ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు తాసిల్దార్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మండలాధ్యక్షురాలు భారతి మాట్లాడారు. అంగన్వాడి సెంటర్ల ద్వారా గ్రామాల ప్రజలకు, టీచర్లు అనేక సేవలు అందిస్తున్నారని, శ్రమకు తగ్గ ఫలితంగా కనీస వేతనం 26,000 అందజేసి 10 లక్షల రూపాయలు ఎక్స్రేసియాను టీచర్లకు, ఆయాలకు 5 లక్షల రూపాయల ఎక్స్ప్రెస్ అందజేయాలని, ప్రభుత్వము ప్రవేశపెట్టిన 14, 19, 8 జీవోలను సవరించి, బకాయి ఉన్న రేషన్ సర్కుల రవాణా చార్జీలను టీచర్లకు అందజేయాలన్నారు. ప్రభుత్వము ప్రవేశపెట్టిన ఇంటర్నెట్ సాఫ్ట్వేర్ యాప్ రద్దుచేసి శ్రమకు తగ్గ ఫలితాన్ని అందజేయాలని ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు శంకరపట్నం తాసిల్దార్ అనుపమ రావుకు తమ సమస్యల పరిష్కారం కోసం ఓ వినతిపత్రం అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ల సంఘం నాయకురాలు, రాజమణి రమాదేవి కాంతా, సరిత, భాగ్య, పద్మ, కర్ణ, సుమలత, రాజ్యలక్ష్మి, జీవసాధన, స్వరూప భాగ్యలక్ష్మి, రాణి తో పాటు అన్ని గ్రామాల్లోని టీచర్లు పాల్గొన్నారు.