గ్రామీణ ప్రాంతాల అభివృద్దే లక్ష్యం.

రానున్న రోజుల్లో కార్పొరేట్ విద్య ప్రభుత్వ కసరత్తు..
ఎమ్మెల్యే రసమయి బాలకిషన్..
శంకరపట్నం జనంసాక్షి సెప్టెంబర్ 4 :
తెలంగాణలో బిఆర్ఎస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామీణ ప్రాంతాల అభివృద్దే లక్ష్యంగా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి నిధులు విడుదల చేస్తున్నాడని, మానకొండూర్ ఎమ్మెల్యే, తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక రథసారధి చైర్మన్ రసమయి బాలకిషన్ అన్నారు. సోమవారం కరీంనగర్ జిల్లా, మానకొండూర్ నియోజకవర్గం, శంకరపట్నం మండలం, మొలంగూర్ గ్రామంలో అంబేద్కర్ విగ్రహ ప్రతిష్టాపన, నూతన గ్రామపంచాయతీ, భవనం మహిళా సమైక్య భవనం, ఆయుర్వేద వైద్యశాల భవనం, రజక కమ్యూనిటీ భవనం నిర్మాణానికి, ఓపెన్ జిమ్ భవనం కోసం, శంకుస్థాపన చేసి, చింతల పల్లె గ్రామంలో గ్రామ దేవత పోచమ్మ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఎమ్మెల్యే రసమయి మాట్లాడారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం లో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించాడని అందులో భాగంగానే సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి నిధులు విడుదల చేస్తున్నాడని పేర్కొన్నారు. తెలంగాణలో అన్ని వర్గాల అభ్యున్నతి కోసం సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి కులవృత్తులను కుల సంఘాలను అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారని రానున్న రోజుల్లో ప్రతి పేద కుటుంబాలకు, కార్పొరేట్ విద్యను అందించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని, ప్రతి పేద విద్యార్థి ఇతర దేశాల్లో ఉన్నత చదువులు చదవడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి కేసీఆర్ 20 లక్షలకు పైన ప్రభుత్వం నుండి స్కాలర్షిప్లను అందజేయడం జరుగుతుందని ప్రతి పేద విద్యార్థి చదివే లక్ష్యంగా ముందుకు సాగాలని విద్యార్థులకు సూచించారు. జడ్పిటిసి లింగంపల్లి శ్రీనివాసరెడ్డి , వైసీపీ పులి కోట రమేష్ సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు పల్లె సంజీవరెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు పెద్ది శ్రీనివాసరెడ్డి, సర్పంచులు మోరే అనుష శ్రీనివాస్, భద్రయ్య ,కిషన్ రావు, సంపత్, ఎంపీటీసీలు ఎస్కే మోయిన్, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గంట మహిపాల్, గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు, మాజీ ప్రజా పతినిధులు, అనుబంధ సంఘాల నాయకులు, వివిధ కుల సంఘాల నాయకులు యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

తాజావార్తలు