ఈనెల 7న యువ మహిళా ఓటర్లు ప్రత్యేక నమోదు కార్యక్రమం
-జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి.
గద్వాల నడిగడ్డ సెప్టెంబర్ 5 (జనం సాక్షి);ఈ నెల 7న శుక్రవారం యువ మహిళ ఓటర్ల ప్రత్యేక నమోదు కార్యక్రమానికి 18- 21 సంవత్సరాల వయసు ఉన్న యువ మహిళా ఓటర్లు హాజరై వారి ఓటును నమోదు చేసి చెక్ చేసుకునెల అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులను ఆదేశించారు.సోమవారం జిల్లా ఐడిఓసి కలెక్టర్ ఛాంబర్ నందు యువ మహిళా ఓటర్ల నమోదుపై మాట్లాడుతూ జిల్లాలో 18 నుండి 21 సంవత్సరాలు నిండిన యువ మహిళా ఓటర్లు నమోదు ప్రత్యేక కార్యక్రమం శుక్రవారం ఏర్పాటు చేస్తూనట్లు తెలిపారు.ఈ ప్రత్యేక యువ మహిళా ఓటర్లు నమోదు చేయుట కు, కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పట్టణాలలో, గ్రామాలలో మున్సిపల్ కమిషనర్, గ్రామపంచాయతీ కార్యదర్శులు టామ్ టామ్ వేయించి యువ మహిళా ఓటర్లను ఆహ్వానించాలని తెలిపారు.వచ్చిన వారందరికీ ఓటు ఉందా లేదా అన్నది చెక్ చేసుకోవాలి. ఓటు నమోదు అయి ఉంటే ఏపీక్ కార్డు చూడాలని, ఓటరుగా నమోదు కాని పక్షం లో ఫారం -6ద్వారా నమోదు చేయించాలని, ఎవరైనా కొత్త ఓటర్లు ఉంటే వారిని నమోదు చేయాలని ఆదేశించారు. ప్రత్యేక ఓటర్ నమోదులో ఎపిక్ కార్డులు ఎంతమందికి ఉన్నాయో తనిఖీ చేసి లేని పక్షంలో వారికి కొత్తఓటరుగా నమోదు చేసి,ఎపిక్ కార్డులు వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. యువ మహిళా ఓటర్లు ఓటర్ నమోదు కార్యక్రమానికి హాజరయ్యేలా మున్సిపల్ కమిషనర్లు, గ్రామపంచాయతీ కార్యదర్శులు, అంగన్వాడీ టీచర్లు అవగాహన కల్పించాలన్నారు. ప్రత్యేక ఓటర్ నమోదు కార్యక్రమంలో ప్రతి ఒక్క యువ మహిళా ఓటరు పాల్గొనేలాచూడాలని, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమానికి బిఎల్వోలు హాజరై ఓటు చెక్ చేసి లేనిపక్షంలో ఫారం-6 ద్వారా నమోదు చేయాలన్నారు. ప్రత్యేక మహిళా ఓటరు నమోదు కార్యక్రమం లో ప్రజలందరికి తెలిసేలా మానవహారం, రంగోలి, పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరగాలని అధికారులకు ఆదేశించారు.ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు చీర్ల శ్రీనివాస్, అపూర్వ చౌహాన్, స్వీప్ నోడల్ అధికారి రమేష్ బాబు,మున్సిపల్ కమీషనర్ నర్సింహా లు,డిపిఓ వెంకట్ రెడ్డి, ఇన్చార్జి డిఎంహెచ్ఓ సిద్ధప్ప,సి సెక్షన్ సూపరింటెండెంట్ నరేష్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.