కేంద్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాలఅమలు చేయాలి

-బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డికె. అరుణ.

గద్వాల నడిగడ్డ, సెప్టెంబర్ 4 (జనం సాక్షి);కేంద్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాలను అసెంబ్లీ సెక్రెటరీ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర ఎన్నికల సంఘం వెంటనే అమలు చేయాలనీ డికె. అరుణ కోరారు. సోమవారము గద్వాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డి.కె. అరుణ మాట్లాడుతూ ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి అఫిడవిట్ లో తప్పుడు సమాచారం ఇచ్చారని హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం కేంద్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన కీలక ఆదేశాలను అసెంబ్లీ సెక్రటరీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంటనే స్పందించి అసెంబ్లీ లో ఎమ్మెల్యే గా ప్రమాణ స్వీకారం చేసే విధంగా అన్ని ఏర్పాట్లు చేయాలని కోరారు.రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ ను విడుదల చేయాలని అసెంబ్లీ కార్యదర్శికి, ప్రభుత్వ కార్యదర్శికి, తెలంగాణ చీఫ్ ఎలెక్టోరల్ ఆఫీసర్ వికాస్ రాజ్ కు కేంద్ర ఎన్నికల కమిషన్ లేఖ పంపినట్లు ఆమె తెలిపారు.
అధికార పార్టీ నాయకులకు గురువింద నీతి తెలియదా అని
ప్రజా ఆమోదంతో గెలుపొందిన సర్పంచులను అధికారం అడ్డుపెట్టుకొని తప్పుడు నిధుల దుర్వినియోగ విషయంలో పదవుల నుండీ తొలగించిన విషయం అధికార పార్టీ నాయకులకు తెలియదా అని ప్రశ్నించారు.ఎంపీటీసీలు తప్పుడు అఫిడవిట్ లు సమర్పించారని తొలగించినప్పుడు ఉన్న నీతి మీకు వర్తించదా అని ప్రశ్నించారు.అధికార పార్టీలో ఉన్న వారికే దళిత బంధు ఇస్తామని కార్యకర్తలకే పథకాలు వర్షిస్తాయని చెప్పడం సిగ్గుగా లేదా అని నిలదీశారు. ఈ పథకాలు వాళ్ళ ఇంటి నుంచి ఇస్తున్నారా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు అందర్నీ సమాన దృష్టితో చూస్తామని చెప్పిన విషయం గుర్తుకు రావడం లేదా అన్నారు.నరేంద్ర మోడీ నాయకత్వంలో కేంద్రంలో రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వం ఏర్పడబోతుందని, ప్రజలు మార్పును కోరుతున్నారనీ, తప్పక బిజెపి ప్రభుత్వం వస్తుంది అని ఆశాభావం వ్యక్తం చేశారు.ప్రజా స్వామ్యంలో కోర్టుల తీర్పును గౌరవించి నన్ను ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయించాలన్న డి కె అరుణ కోరారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కృష్ణారెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ రామాంజనేయులు, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు మీర్జాపురం వెంకటేశ్వర్ రెడ్డి, ఓబిసి మోర్చా జిల్లా అధ్యక్షుడు కబీర్దాస్ నర్సింలు, బిజెపి సీనియర్ నాయకుడు అశోక్ తదితరులు ఉన్నారు.

తాజావార్తలు