పోలీస్ సిబ్బందికి పలు సూచనలు చేసిన జిల్లా ఎస్పీ చంద్రమోహన్

మహబూబాబాద్, క్రైమ్ (సెప్టెంబర్ 4) జనం సాక్షి న్యూస్:మహబూబాబాద్ జిల్లా లో ఇటీవల ఎస్పీ గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్పీ చంద్ర మోహన్ జిల్లాలోని కురవి పోలీస్ స్టేషన్, మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్, మానుకోట పట్టణంలోని షీ టీమ్స్, బరోసా సెంటర్ ను నేడు తమ సిబ్బందితో కలిసి సందర్శించి పలు సూచనలు చేయడం జరిగింది. అనంతరంకురవి పోలీస్ స్టేషన్ పరిసరాలు పరిశీలించి, అధికారులతో సిబ్బంది తో ఎస్పీ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని తెలుపుతూ, వార్నింగ్ బోర్డ్స్, స్పీడ్ లిమిట్ బొర్డ్స్ ఉండేలా చూడాలని, రైతులు ధాన్యం రోడ్ల పైన ఆర వేయకుండ వారికి ప్రమాదాల పైన అవగాహన కల్పించాలని, రాత్రి సమయాల్లో పశువులను రోడ్ల పైన వదిలేయకుండా చూసుకోవాలని అన్నారు. అనంతరం షి టీమ్స్, బరోసా సెంటర్ ను సందర్శించిమహిళా భద్రతకు తెలంగాణ పోలీస్ వ్యవస్థ పెద్ద పీట వేస్తుందని సిబ్బందికి తెలుపుతూ షి టీమ్స్ బరోసా సెంటర్ పని తీరును అడిగి తెలుసుకొని, మహిళా భద్రత కోసం వారికి అవగాహన కల్పించడం కోసం కార్యక్రమలు నిర్వహించాలని, సలహాలు సూచనలు చేయడం జరిగింది. అనంతరం మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్ సందర్శించి ఫైల్స్, రికార్డ్స్, రైటర్,ఈ కప్స్ ,రిసెప్షన్ తో పాటు ఇతర గదులను పరిశిలిస్తూ, సీసీ కెమెరాల పని తీరు కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూం ను పరిశీలించి, అధికారులకు తగు సూచనలు చెయ్యడం జరిగింది.

తాజావార్తలు