ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలకు గడ్డేన్న ప్రాజెక్టులో చేరుతున్న నీరు
భైంసా రూరల్ జనం సాక్షి సెప్టెంబర్05
నిర్మల్ జిల్లా భైంసా గడ్డెన్న వాగు ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 8600 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుంది. దీంతో అధికారులు ఒక గేటు ఎత్తి 8600 క్యూసెక్కుల నీటిని కిందకు విడుదల చేశారు. గడ్డేన్న వాగు ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 358.70 మీటర్లు కాగా ప్రస్తుత నీటి మట్టం 358.60 మీటర్లుగా ఉంది.ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 1.852 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి సామర్థ్యం 1.768 టీఎంసీలుగా ఉంది.ప్రాజెక్టు పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు