విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఆర్టీసీ బస్సులను నడిపించాలి
-పి డి ఎస్ యు జిల్లా అధ్యక్షుడు హలీంపాష.
గద్వాల నడిగడ్డ, సెప్టెంబర్ 5 (జనం సాక్షి);
విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఆర్టీసీ బస్సులు నడిపించాలని మంగళవారము జోగులాంబ గద్వాల జిల్లా టిఎస్ఆర్టిసి గద్వాల డిపో మేనేజర్ మంజులకు పి డి ఎస్ యు ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించినట్లు జిల్లా పి డి ఎస్ యు జిల్లా అధ్యక్షుడు హలిం పాష తెలిపారు. విద్యార్థుల సంఖ్యకు టైం కు అనుకూలంగా ఆర్టీసీ బస్సు నడిపించాలని ప్రతిరోజు వివిధ గ్రామాల నుంచి వందలాదిమంది విద్యార్థులు విద్యను అభ్యసించడానికి జిల్లా కేంద్రానికి వస్తుంటారు కానీ వాళ్లకు టైం కు ఆర్టీసీ బస్సులు గ్రామాలకు రాకపోవడంతో విద్యార్థులు టైం కు పాఠశాలకు కళాశాలకు చేరుకోలేని పరిస్థితి ఉన్నదనీ,గట్టు మండలం నుంచి గొర్లఖాన్ దొడ్డి, ఆరగిద్ద, పెంచికలపాడు, మద్దెల బండ మీదుగా వస్తున్న బస్సును డీజిల్ కు డబ్బులు రావటం లేదని బస్సును రద్దు చేయడం సబాబు కాదని బస్సును పునః ప్రారంభించాలని గతంలో ఏ విధంగా అయితే ఆరగిద్ద గట్టు బస్సు ఏ విధంగా వస్తుందో ఆ విధంగానే ఏర్పాటు చేయాలని కోరారు.30, 40 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి పరిస్థితి ఈ గ్రామాలకు విద్యార్థులకు సంఖ్యకు అనుకూలంగా బస్సులు నడపాలని కోరారు.
ఆర్టీసీ డిపో మేనేజర్ మంజుల మేడం స్పందిస్తూ బస్సును పంపించే విధంగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
కార్యక్రమంలో పి డి ఎస్ యు నాయకులు రాజేంద్ర, వీరస్వామి, నరేష్, నరసింహ, ఆంజనేయులు, కే.విజయ్, వినోద్, జస్వంత్ తదితరులు పాల్గొన్నారు.