మాజీ మంత్రి మాణిక్ రావు వర్ధంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి.
జీవితాంతం సబండ వర్గాల అభివృద్ధి ఆకాంక్షించిన గొప్ప మహనీయుడు మాణిక్ రావు.
తాండూరులో బీసీ జెండా ఎగిరిన రోజే ఆ మహనీయునికి నిజమైన నివాళులు.
బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు రాజ్ కుమార్ కందుకూరి.
తాండూరు సెప్టెంబర్ 5(జనంసాక్షి) తెలంగాణ సర్దార్ మాజీ మంత్రి స్వర్గీయ మాణిక్ రావు మహారాజ్ జయంతి వేడుకలు మంగళవారం
బీసీ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాతీయ బిసి కార్యవర్గ సభ్యులు రాజ్ కుమార్ తదితరులు కలిసి మాణిక్యరావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళుల ర్పించారు .ఈ సందర్భంగా రాజ్ కుమార్ మాట్లాడుతూ తాండూర్ ప్రాంతానికి తొలి దశ ఉద్యమ నేత జైలు జీవితం గడిపిన మహనీయులు తెలంగాణ సర్దార్ గా పేరుపొందిన మాణిక్ రావు వర్ధంతి ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే విధంగా కృషి చేయాలని మాణిక్ రావు జీవిత కాలం వెనుకబడిన తరగతులు బహుజన బిడ్డల అభివృద్ధి కోసం ఆకాంక్షించి చెన్నారెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నప్పుడు కూడా వారిని విభేదించి సబండ వర్గాల కోసం అనేక సంక్షేమ పథకాలు రూపొందించడంలో ముందున్నారని తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో బీసీల కొరకు గళం విప్పిన మొట్టమొదటి బీసీ నేతగా చరిత్రలో నిలిచిపోయారని మాణిక్ రావు గొప్పతనం యావత్ తెలంగాణ గుర్తించిందన్నారు. అంతటి గొప్ప మహా ఉన్నతమైన వ్యక్తి కలలు కన్నా తాండూరు గడ్డపై బీసీ జెండా ఎగిరిన రోజే వారికి నిజమైన నివాళులు అర్పించిన వారవుతామని అన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ కార్యదర్శి సయ్యద్ సుకుర్ ,బిసి మహిళా సంఘం అధ్యక్షురాలు జ్యోతి, ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షులు లంక నర్సింలు, ముదిరాజ్ సంఘం తాండూర్ నియోజకవర్గ అధ్యక్షులు ఎస్పి రవికాంత్, తాండూర్ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు శ్రీకాంత్, రామ ముదిరాజ్, బిసి నియోజకవర్గ కార్యదర్శి బోయ రాధాకృష్ణ, బీసీ సంఘం సోషల్ మీడియా ఇంచార్జ్ బసవరాజ్, బిసి నాయకులు బోయ మాధవ్, నాయి నరేష్, మతిన్, నగేష్ కిరణ్ తదితరులు పాల్గొని మాణిక్యరావు విగ్రహానికి పూలమాలతో నివాళులర్పించారు.