శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న మంచిర్యాల భక్త బృందం

సామూహిక లలిత శాస్త్ర నామ పారాయణం
– అమ్మవారి గాజుల పూజ
జనం సాక్షి , మంథని : ఆధ్యాత్మిక కేంద్రంగా విరసిస్తున్న మంథని పట్టణం లోని దేవాలయాలను సందర్శించడానికి ప్రతినిత్యం అనేకమంది భక్తులు వస్తుంటారు. అందులో భాగంగా శ్రావణ మాసంలో వివిధ ప్రాంతాల నుండి విశేష సంఖ్యలో భక్తులు వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. మహిళా భక్త బృందం శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో శ్రీ లలితా సహస్ర నామ పారాయణం చేశారు. అందులో భాగంగా మంగళవారం శ్రీ మంగళ గౌరీ మాత పర్వదినమున పురస్కరించుకొని మంచిర్యాలకు చెందిన శ్రీ లలితా సేవా సమితి ఆధ్వర్యంలో మహిళా భక్తులు వచ్చి శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారిని నూతన వస్త్రాలతో పూలమాలలతో అలంకరించి పసుపు కుంకుమ సమర్పించారు. అలాగే అమ్మవారికి గాజుల పూజ చేసిన అనంతరం అమ్మవారిని గాజులతో అలంకరించారు. ఈ సందర్భంగా వారి వెంట వచ్చిన పూజారి కొమ్మే విశ్వేశ్వర శర్మ మాట్లాడుతూ శ్రీ మహాలక్ష్మీ అమ్మవారు శక్తి స్వరూపిణి, అని జగజ్జనని అని ఆ తల్లి ఓరి నా కోరికలు తీర్చే కొంగు బంగారం అని తెలిపారు మంగళవారం రోజున అమ్మవారికి పూజలు చేస్తే ఆమె దీవెనలు ఎల్లప్పుడూ ఉంటాయని తెలిపారు.

తాజావార్తలు