డి.కె. అరుణ మీకు ఎమ్మెల్యేగా ఉండే నైతిక హక్కు లేదు
-ఎం ఐ ఎం జిల్లా అధ్యక్షుడు మున్న భాష.
గద్వాల నడిగడ్డ, సెప్టెంబర్ 5 (జనం సాక్షి);
ఆరోజు ఓట్లు వేసింది కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీ కి కాదు ఎమ్మెల్యేగా ఎలా ఉంటారనీ డీకే అరుణ ఉద్దేశించి జోగులాంబ గద్వాల జిల్లా ఎంఐఎం అధ్యక్షుడు మంగళవారం విలేకరుల సమావేశంలో మున్నాభాషా అన్నారు.
ఆరోజు వేసిన 70,000 వేల ఓట్లకు ఆ ప్రజలకు విలువ లేదా సమాధానం చెప్పాలనీ,2,000 వేల ఓట్లు కూడా రాని పార్టీలో ఉండి అప్పనంగా ఎమ్మెల్యే అయితానంటే ప్రజలు తిరగబడతారనీ,బిజెపి పార్టీకి పడిన ఓట్ల శాతాన్ని చూస్తే మీకు అర్థం కాలేదా ఇక్కడ బిజెపికి స్థానం లేదని,ప్రజలు తిరస్కరించిన పార్టీలో ఉండి ఎమ్మెల్యే ఎలా అవుతారు ఒకసారి మనస్సాక్షితో ఆలోచించండి అని 2018 లో జరిగిన అసెంబ్లీ
నియోజకవర్గ ఎన్నికలలో టిఆర్ఎస్ కు లక్షకు పైన ఓట్లు రావడం జరిగిందనీ, కాంగ్రెస్ కు 70 వేల పైచిలుకు ఓట్లు రావడం జరిగిందనీ,బిజెపికు 1800 వందల పైచిలుకు ఓట్లు రావడం జరిగిందనీ,కోర్టు ఉత్తర్వుల ప్రకారం రెండవ స్థానంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యేగా కొనసాగాలని కోర్టు ఉత్తర్వులను జారీ చేసిందనీ,
ఇప్పుడు మీరు మూడవ స్థానంలో నిలిచిన బిజెపి పార్టీలో ఉన్నారు కాబట్టి మీకు ఆ అర్హత లేదనీ,లేదా ఎమ్మెల్యేగా కొనసాగాలంటే మీరు కాంగ్రెస్ పార్టీకి మారాల్సి ఉంటుందనీ ఆరోజు ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసినారు కాబట్టి రెండవ స్థానంలో నిలిచిన ఈరోజుకి కాంగ్రెస్ పార్టీలో ఉన్న అభ్యర్థికే ఎమ్మెల్యే పదవి పొందే అర్హత ఉంటుందనారు. ఆనాడు మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారని మేమంతా మీకు 70 వేల ఓట్ల ను వేసి రెండవ స్థానంలో నిలిపినాము.2000 ఓట్లు కూడా పడని బిజెపిలో ఉండి ఎమ్మెల్యేగా ఎలా కొనసాగుతావు.ఆరోజు ఓట్లు వేసింది కాంగ్రెస్ కు మాత్రమే కానీ బిజెపికి కాదు ఇప్పుడు నువ్వు బిజెపిలో ఉన్న వ్యక్తివి ఎమ్మెల్యేగా ఉండే అర్హత నీకు లేదు.కోర్టు ఉత్తర్వుల ప్రకారం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రెండవ స్థానంలో నిలిచిండు మరి ఇప్పుడు మీరు బిజెపి అభ్యర్థి కాబట్టి ఎమ్మెల్యే అయ్యే నైతిక హక్కు కోలిపోవడమైనది.
గద్వాల ప్రజలు కాంగ్రెస్ ను నమ్మారు నిన్ను కాదు కావున ఎట్టి పరిస్థితిలో మీరు ఎమ్మెల్యే పదవికి అర్హులు కారు హుందాగా మీరే రాజీనామా చేయండి లేదా కాంగ్రెస్ పార్టీలో అన్నా చేరండి అప్పుడు మీ ఎమ్మెల్యే హోదాను మేము గౌరవిస్తాము ఆమోదిస్తాం కూడా.ఇలా అడ్డదారిన ఎమ్మెల్యే అవుతాం అంటే గద్వాల ప్రజలు చేతులు కట్టుకొని ఊరికే ఉండరు మేము కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయించి మీకు ఎమ్మెల్యే పదవి రాకుండా కోర్టు ద్వారా ఉత్తర్వులు తీసుకొని వస్తాము.
2000 ఓట్లు కూడా పడని పార్టీలో ఉండి అప్పనంగా ఎమ్మెల్యేగా ఉండాలనుకుంటే మీ పప్పులు ఇక్కడ ఉడకవు జాగ్రత్త.గద్వాల ప్రజలు అంత అమాయకులని అనుకోకండి ఇన్ని రోజులు మీరు ఆడించినట్టు ఆడారేమో గాని ఈతరం మాత్రం ఎంతో చైతన్యంగా ఆలోచిస్తున్నారు ఎంతటి వారినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారని తెలుసుకోండి న్యాయబద్ధంగా ఎమ్మెల్యే అయితే మాకు ఎటువంటి అభ్యంతరం లేదు దొడ్డదారిన ఎమ్మెల్యే అయితామంటే చూస్తూ ఊరుకోము.సగటు ఓటరుగా సవాలు చేస్తున్నా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండి.
మీరు చేస్తున్నది తప్పని తెలిసి ప్రశ్నిస్తున్న మీ మనస్సాక్షిని అడగండి ఏ గుర్తుతో మీకు 70 వేల ఓట్లు వచ్చాయో ఆ పార్టీ నీ వదిలేసి 2000 ఓట్లు కూడా రాని పార్టీలో ఉండి ఎం ఎల్ ఏ అవుతానంటే ప్రజలు ఎలా ఆమోదిస్తారు.మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీని రెండవ స్థానంలో నిలిపింది ప్రజలే కదా ఆ ప్రజలకే ఎగనామం పెడుతున్నారు ఇదిమంచిది కాదు.ప్రజాస్వామ్య వాదులు మేధావులు విద్యార్తులు గద్వాల లో జరుగుతున్న ఈ కుర్చీ పొట్లాట గురించి మనం ప్రశ్నించాలి అప్పుడే మనం అనుకున్న మంచి పాలన మనకు అందేది .గెలిపించిన ఎమ్మెల్యే నిర్లక్ష్యంతో పదవి పోగొట్టుకున్నాడు రెండో స్థానంలో ఉన్న వ్యక్తి మూడో స్థానంలో ఉన్న పార్టీలోకి వెళ్ళింది వీళ్ళు ఎవరూ కూడా ప్రజల అభిప్రాయాలకు విలువ ఇచ్చేలా కనిపించట్లేదు ఏం చేయాలో ప్రజలే ఆలోచించాలనీ
మున్నా భాష అన్నారు. ఈ కార్యక్రమంలో అల్తాఫ్ హుస్సేన్, ఎండి రఫీ, కే జీ ఎన్ రఫీ, మహమ్మద్ జానీ, షర్ఫద్దిన్, అస్లాం, అంజద్, షమీ తదితరులు పాల్గొన్నారు.