ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్ర గౌరవప్రదమైనది
రాష్ట్ర మంత్రి డాక్టర్ పి మహేందర్ రెడ్డి

వికారాబాద్, రూరల్ సెప్టెంబర్ 5 జనం సాక్షి

ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్ర, గౌరవప్రదమైనదని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు మరియు గనుల, భూగర్భవనరుల శాఖ మంత్రి డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు.జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవం పురస్కరించుకొని కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ఉత్తమ ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా మంత్రి విచ్చేశారు.
ఈ సందర్భంగా ఆయన ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపి, 75 మంది జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులను జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి, అదనపు కలెక్టర్లు రాహుల్ శర్మ, లింగ్యా నాయక్, ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ అమిత్ నారాయణ్, జిల్లా ఎస్పీ కోటిరెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుశీల్ కుమార్ గౌడ్, మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల రమేష్, ఎంపీపీ చంద్రకళ, జిల్లా విద్యాశాఖ అధికారి రేణుకాదేవి లతో కలిసి ఘనంగా సన్మానించి ప్రశంసా పత్రాలు, మెమొంటోళ్లతో సత్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ
కనిపించే దైవంగా
ఎందరో గొప్ప వ్యక్తులను తీర్చిదిద్దిన ఘనత గ్రామీణ ఉపాధ్యాయులదేనన్నారు.
రాష్ట్రంలో ప్రభుత్వం విద్యాభివృద్ధికి ఎంతో కృషి చేస్తుందని గత తొమ్మిది ఏళ్ల కాలంలో రాష్ట్రంలో విద్యాభివృద్ధికి ప్రభుత్వం 1 లక్ష 87 వేల కోట్ల నిధులను ఖర్చు చేసిందని మంత్రి తెలిపారు. అన్ని వర్గాల విద్యార్థుల కోసం బీసి,
ఎస్సి, ఎస్టి, మైనార్టీ గురుకులాలను స్థాపించి
12 వేల పోస్టులను భర్తీ చేసినట్లు మంత్రి తెలిపారు.
విద్యార్థుల తల్లిదండ్రులు కూడా బాధ్యతగా తీసుకొని ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వానికి, ఉపాధ్యాయులకు సహకరించాలని మంత్రి కోరారు.
*సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులది ముఖ్యపాత్ర : జిల్లా కలెక్టర్

జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి మాట్లాడుతూ.సమాజ నిర్మాణాల్లో ఉపాధ్యాయులు ముఖ్య పాత్ర పోషిస్తారన్నారు. ఉపాధ్యాయులు మంచి విద్యను అందిస్తూనే విద్యార్థులు నైతిక విలువలు పాటించే విధంగా కృషి చేయాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదని కలెక్టర్ తెలిపారు. విలువలతో కూడిన విద్యను అందించడంతో పాటు భారతీయ సంస్కృతి సాంప్రదాయాలతో ముందుకు సాగాలని కలెక్టర్ ఉపాధ్యాయులకు సూచించారు. దేశంలోని సంస్కృతి సాంప్రదాయాలకు భిన్నంగా పాశ్చాత్య ధోరణి కనిపిస్తుందని చెడుకు దూరంగా సమాజంలో విలువలతో కూడిన జీవనాన్ని అలవర్చుకోవాలని కలెక్టర్ సూచించారు. పిల్లల భవిష్యత్తు చాలా ముఖ్యమని వారిలో ఆ నమ్మకానికి కలిగించేలా ఉపాధ్యాయులు విద్యా వ్యవస్థ ముందుకు సాగేలా కృషి చేయాలని కలెక్టర్ తెలిపారు. విద్యార్థులను మంచి పౌరులుగా తీర్చిదిద్దే క్రమంలో తోటి వారితో మంచిగా మెలిగేలా ఉండాలని దీనికి తల్లిదండ్రుల ప్రోత్సాహం కూడా చాలా అవసరమని కలెక్టర్ ఈ సందర్భంగా తెలిపారు.ఈ సందర్భంగా సమగ్ర శిక్షణా మరియు భారత కృత్రిమ అవయవాల నిర్మాణ సంస్థ సహకారంతో 5 లక్షల 51 వేల 340 రూపాయల వ్యయంతో 192 మంది దివ్యాంగ విద్యార్థులకు 278 ఉచిత ఉపకరణాలను మంత్రి చేతుల మీదుగా అందజేశారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘాల నాయకులు, మండల విద్యాశాఖ అధికారులు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు