ఒక దీపం వెయ్యి దీపాలను ఎట్లా వెలిగిస్తదో ఒక ఉపాధ్యాయుడు వెయ్యి మంది విద్యార్థుల జీవితాలు వెలుగులను నింపుతాడు
తెలంగాణ సాధనలో ఉపాధ్యాయుల పాత్ర అమోఘం
టీఎస్ హెచ్ డి సి చైర్మన్ చింత ప్రభాకర్
సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ లో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు …
జ్యోతి ప్రజ్వలన వెలిగించి కార్యక్రమం ప్రారంభం
ముఖ్య అతిథులుగా హాజరైన TSHDC చింతా ప్రభాకర్ గ ,జిల్లా పరిషత్ చైర్ పర్సన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి
సంగారెడ్డి బ్యూరో , జనం సాక్షి , సెప్టెంబర్ 5 :::
ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఆడిటోరియంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీఎస్ హెచ్ డి సి చైర్మన్ చింతా ప్రభాకర్, జిల్లా జడ్పీ చైర్ పర్సన్ మంజు శ్రీ జయపాల్ రెడ్డిలో హాజరైనారు.
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కార ప్రదానోత్సవం జరిగింది.
జిల్లా నుంచి ఎంపికైన ఉత్తమ ఉపాధ్యాయులను శాలువతో సన్మానించి జ్ఞాపికను అందజేశారు.
ఈ సందర్భంగా చింత ప్రభాకర్ మాట్లాడుతూ
బాల్యం నుంచి విద్యార్థికి విద్యా బుద్దులతో పాటు క్రమశిక్షణా ,సమాజంలో ఎలా బతకాలి అన్న దానిపై ఉపాధ్యాయులు నేర్పించడం లో విద్యార్థులు ఉపాధ్యాయులకు గుండెల్లో గుడి కడుతూ తమ అభిమానాన్ని చాటుతారన్నారు.
విద్యార్థులకు ఉపాధ్యాయులు అందించే విద్యాబోధన ద్వారా విద్యార్థుల తల్లిదండ్రుల ఖ్యాతి పెరుగుతుందని,
ఒక దీపం వెయ్యి దీపాలను ఎట్లా వెలిగిస్తదో ఒక ఉపాధ్యాయుడు వెయ్యి మంది విద్యార్థుల జీవితాలు వెలుగులను నింపుతారన్నారు.
తెలంగాణ సాధనలో ఉపాధ్యాయుల పాత్ర అమోఘమని కొనియాడారు.
ఉమ్మడి జిల్లాకు సంబంధించి విద్యా సంస్థల్లో రాష్ట్రస్థాయిలోనే ప్రథమ స్థానంలో నిలవడం ఉపాధ్యాయుల గొప్పతనమే …
కార్యక్రమంలో డిఇఓ వెంకటేశ్వర్లు ,గ్రంథాలయ సంస్థ చైర్మన్ నరహరి రెడ్డి , సి.డి.సి చైర్మెన్ కసాల బుచ్చిరెడ్డి ,మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రభూ గౌడ్ , మాజీ సి.డి.సి చైర్మెన్ విజేందర్ రెడ్డి ,వివిధ ఉపాద్యాయ సంఘం నేతలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు …