వరి పంటలో కాండం తోలుచు పురుగుకు నివారణ చర్యలు చేపట్టాలి….

వ్యవసాయ అధికారి బాల్ రెడ్డి…

చిలప్ చేడ్/సెప్టెంబర్/జనంసాక్షి:- మండలంలోని ఫైజాబాద్ గ్రామంలో వ్యవసాయ అధికారి బాల్ రెడ్డి పత్తిపంట వరి పంటలను పరిశీలించడం జరిగింది. ఈసందర్భంగా ఏవో బాల్ రెడ్డి మాట్లాడుతూ రైతులకు వరి పంటలో సమగ్ర సస్యరక్షణ పద్ధతులు వివరించడం జరిగింది. అందులో భాగంగా వరి పంటలో కాండం తొలుచు పురగు ను గుర్తించడం జరిగింది, దీని నివారణ కొరకు ఎకరానికి 400 gr కార్టాప్ హైడ్రో క్లోరైడ్ 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా వరిలో ఎండు తెగులును నివారించడానికి అగ్రిమైసిన్ 0.2 gr లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా రైతులు పిచికారి చేస్తున్నప్పుడు చేతులకు గ్లౌస్ లు, ముఖానికి మాస్క్ ధరించాలి అని గాలి వీచే దిశగా పిచికారి చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా పత్తి పంటలో అంతర కృషి చేసుకోవాలని తద్వారా కలుపును నివారించుకోవచ్చు సూచించారు. ఈ కార్యక్రమంలో రైతులు గోపాల్, శివరాం తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు