ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి

జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య
మోమిన్ పేట సెప్టెంబర్ 5 జనం సాక్షి:
ప్రతి ఒక్కరూ దైవచింతన కలిగి ఉండి ప్రతినిత్యం భగవంతుని ఆరాధిస్తే సుఖసంతోషాలు కలిగి ఉండవచ్చని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య పేర్కొన్నారు వికారాబాద్ జిల్లాలోని మోమిన్ పేట మండలం రాళ్ల గుడిపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన హనుమాన్ మందిరం ప్రారంభోత్సవం విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భగవంతుని సేవా కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాలుపంచుకోవాలని ఆయన సూచించారు భగవంతుని కృపవల్లి సమాజంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో గడుపుతున్నారని ఆయన అన్నారు ప్రతినిత్యం దైవ సన్నిధిలో కొంత సమయం కేటాయిస్తే మనసు ప్రశాంతత మానసిక ఉల్లాసం కలిగి ఉంటారని ప్రతి ఒక్కరూ దైవచింతన కలిగి ఉండాలని ఆయన సూచించారు ఆలయ నిర్మాణానికి స్థలాన్ని దానం చేసిన దాత డాక్టర్ అరుణ్ కుమార్ ను ఇంత మంచి కట్టడాలతో నిర్మించిన ఆలయ నిర్మాణ దాత ఆర్ శ్వేతమ్మ నందకిషోర్ దంపతులను ఆయన అభినందించారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సావిత్రమ్మ బీసీ యువజన విభాగం జాతీయ అధ్యక్షులు డాక్టర్ అరుణ్ కుమార్ మర్పల్లి మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ డి లక్ష్మయ్య జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు యాదగిరి యాదవ్ బాలు గౌడ్ కృష్ణయ్య దంపతులు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు

తాజావార్తలు