ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులకు ఘనంగా సన్మానం ……

భువనగిరి టౌన్ (జనం సాక్షి):—ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకొని భువనగిరి పట్టణంలోని స్థానిక 12వ వార్డుతాతానగర్ లో గల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి చిత్రపటానికి పూలమాల వేయడం జరిగింది అదేవిధంగా స్కూల్ ఉపాధ్యాయులను శాలువాతో ఘనంగా సన్మానించడం జరిగింది ,ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు నీలం రమేష్ మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటు పాఠశాలలకు దీటుగా విద్యను అందించే విధంగా కృషి చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఉపాధ్యాయుడి పేరుమీద ఒక ప్రత్యేక రోజును ఏర్పాటు చేసి ఆ వృత్తిని గౌరవిస్తుండడం మన సంస్కృతిలో నేడు అంతర్భాగం అయిపోయింది ఇది ఎంతైనా గర్వించదగ్గ విషయం. ఉపాధ్యాయులను సత్కరించడం ద్వారా వారి సేవలను గౌరవించాలి వారి యొక్క ఆదర్శాలను అనుసరించాలి అని తెలియజేయడం జరిగింది. టిఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి రచ్చ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయుడంటే పాఠశాలలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహించే వ్యక్తి కానక్కర్లేదు బ్రతుకుతెరువు కోసం పాఠాలు చెప్పుకునే ప్రతి వ్యక్తి ఉపాధ్యాయుడే బ్రతుకు మార్గాన్ని పాఠశాల నుండి చూపించే ఉద్యోగస్తుడే ఉపాధ్యాయుడు ఇక్కడివాడైనా ఆయన స్థానం అత్యుత్తమమైనది అనే విద్యార్థులకు సందేశించడం జరిగింది అదేవిధంగా ఈ కార్యక్రమంలో 12వ వార్డు కౌన్సిలర్ ఊదరి లక్ష్మి సతీష్ యాదవ్ , చెన్న గౌరీ శంకర్ ,పాక గోపాల్ , గుండబోయిన నరసింహ యాదవ్ , చాగంటి నరసింహ ,గుర్రాల శ్రీశైలం ,కొత్త మహేష్ భీమరాజు ,మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు