తల్లిదండ్రులు జన్మనిస్తే గురువులు జీవితాన్ని ఇస్తారు

]

-జడ్పీ చైర్ పర్సన్ సరిత.

గద్వాల నడిగడ్డ, సెప్టెంబర్ 5 (జనం సాక్షి);
తల్లిదండ్రులు జన్మనిస్తే గురువులు జీవితాన్ని ఇస్తారని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సరిత అన్నారు. మంగళవారం జిల్లా లో బాలభవన్ లో ఏర్పాటు చేసిన ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ అపుర్వ్ చౌహాన్ ల తో కలిసి జ్యోతి ప్రజల్వన గావించికార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా జిల్లాలో ఎంపికైన 49 మంది ఉపాధ్యాయులను ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమాజంలో గురువుల పాత్ర ఎంతో ఉందని, వారి వల్లనే మనం ఈ స్తానం లో ఉన్నామని అన్నారు. తల్లిదండ్రులు జన్మనిస్తే గురువులు జీవితాన్ని అందిస్తారని అలాంటి గురువుల పట్ల ప్రతి ఒక్క విద్యార్థి అంకితభావంతో ఉండాలని సూచించారు. ఈ అవకాశం ఇచ్చినందుకు గురువులకు నమస్కరిస్తున్నట్లు తెలిపారు. ఎంత పెద్ద ఉన్నత స్థానంలో ఉన్న తల్లిదండ్రుల తర్వాత గురువుకు ప్రాధాన్యత ఇస్తారని ప్రతి గురువు దైవంతో సమానమని అన్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలో విద్యాపరంగా ముందుకు తీసుకెళ్లాలని ఆమె సూచించారు.జిల్లా అదనపు కలెక్టర్ అపుర్వ్ చౌహాన్ మాట్లాడుతూ తల్లి తండ్రులు జన్మ నిస్తే భవిష్యత్తు ను ఇచ్చేది గురువులు అన్నారు. సమాజంలో గురువుల పాత్ర ఎంతో ఉందని అన్నారు. ప్రభుత్వం సౌకర్యాలు అందిస్తుంది కానీ పిల్లలకు విద్యా బోధనా చేయాల్సిన బాద్యత గురువులదే అన్నారు. ఉపాధ్యాయులు సక్రమంగా విధులు నిర్వహించిన నాడే పాఠశాలలో అభివృద్ధి చెందుతాయని తెలిపారు. జోగులాంబ గద్వాల జిల్లా విద్యాపరంగా ముందుకు దూసుకెళ్లాలని ప్రతి ఉపాధ్యాయుడు తన పరిధిలో విద్యాబోధన గావించి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలని అన్నారు.ఈ కార్యక్రమంలో డీఈవో సిరాజుద్దీన్ ,
గ్రంథాలయ చైర్మెన్ జంబు రామన్ గౌడ్, జిల్లా పరిషత్ వైస్ చైర్మెన్ సరోజమ్మ, సర్పంచు బండ్ల జ్యోతి , ఇందిర, ఎమ్ ఈ వో సురేష్, , జిహెచ్ఎంలు, ఉపాధ్యాయులు
తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు