ఎన్ హెచ్ ఎం స్కీం ఉద్యోగులకు పర్మినెంట్ చేయాలని సమ్మె
ఎన్.హెచ్.ఎం. స్కీం ఉద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వ వివక్ష తగదు …
భువనగిరి టౌన్ (జనం సాక్షి):-నేషనల్ హెల్త్ మిషన్ స్కీం లో పనిచేస్తున్న అల్ క్యాడర్స్ ఉద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వ వివక్షతగదని, పర్మనెంట్ అయ్యేంతవరకు పోరాటాలు కొనసాగించాలని వారికి సిపిఐ పార్టీ అండగా ఉంటుందని సిపిఐ జిల్లా కార్యదర్శి గోద శ్రీరాములు అన్నారు.మంగళవారం రోజున ఎన్ హెచ్ ఎం ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న నిరవధిక సమ్మెలో భాగంగా 6వ రోజు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు కార్మికులు చేస్తున్న సమ్మె శిబిరం వద్ద గోద శ్రీరాములు పాల్గొని వారికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ రాష్ట్రంలో సుమారుగా 16,000 మంది ఉద్యోగులు అనేక సంవత్సరాలుగా చాలీచాలని వేతనాలు తీసుకుంటూ పని చేస్తున్నారని, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో చెప్పినట్టు NHM స్కీం లో పనిచేస్తున్న ఉద్యోగులందర్నీ ఎలాంటి షరతులు లేకుండా రెగ్యులర్ చేయాలని, అప్పటివరకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, హెల్త్ ఇన్సూరెన్స్ పదిలక్షలు కల్పించాలని, దురదుష్టవత్తు మరణించిన వారికి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, ప్రతి ఒక్కరికి ఈఎస్ఐ, సౌకర్యం కల్పించాలని అయినా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గోరెటి రాములు ఎం డి ఇమ్రాన్, కార్యవర్గ సభ్యులు సామల శోభన్ బాబు కాంట్రాక్టు & ఔట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు కామ్రాన్, వినోద్, శ్రీదేవి, దుర్గ, సౌజన్య, మధు, , రమేష్, సరిత, భార్గవి, శిరీష, ఉదయశ్రీ తదితరులు పాల్గొన్నారు..