గురువుకు ఘన సన్మానం
తొర్రూర్ సెప్టెంబర్ 5 (జనం సాక్షి):మహబూబాబాద్ జిల్లా తొర్రూరు డివిజన్ కేంద్రంలోని భారతీయ జీవిత భీమ సంస్థ (ఎల్ఐసి) కార్యాలయంలో మంగళవారం బ్రాంచ్ మేనేజర్ హెచ్ నరసింహ రాములు ఆధ్వర్యంలో గురుపూజా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఎల్ఐసి వికాసాధికారి (డివో) శంకర్ నాయక్ ను పూలమాల వేసి శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మేనేజర్ నరసింహ రాములు మాట్లాడుతూ…ఉన్న ఊరును, కన్న తల్లిదండ్రులను, విద్య నేర్పిన గురువులను జీవితంలో ఎప్పుడు మర్చిపోకూడదని అన్నారు.గురువులు తమ శక్తి నంతా దార పోసి జ్ఞానమనే వెలుగుతో మనలో ఉన్న అంధకారాన్ని ప్రార ద్రోలి ప్రపంచాన్ని శాసించే శక్తిలా వ్యక్తిని తయారు చేస్తారని కొనియాడారు.గురువు లేని ప్రపంచం ఊహించడకష్టమని అన్నారు. భూమిపై ఉన్న వ్యక్తిని ఆకాశంలోని అంతులేని రహస్యాలను ఛేదించి, సృష్టికి ప్రతి సృష్టి చేసేలా జ్ఞానాన్ని అందించి…ప్రపంచాన్నే తన కొనగోటిపై ఆవిష్కృతం చేసే వ్యక్తులను(శక్తులను) తయారు చేసే ఘనత ఒక గురువుకే దక్కుతుందన్నారు.ఈ కార్యక్రమంలో అధికారులు సుధాకర్,పరుషరాములు,ఏజెంట్లు దాసరి యాకన్న, మహిపాల్ రెడ్డి, బాణాల బిక్షపతి,రాజ్ కుమార్, యెల్ల గౌడ్,ఉప్పలయ్య,స్వాతి, యాకూబ్ పాషా,పాషా తదితరులు పాల్గొన్నారు.