యాచారం ప్రభుత్వ ఆసుపత్రి ముందు ఆశ వర్కర్ల ధర్నా

అనంతరం ఆస్పత్రి డాక్టర్ రాజ్యలక్ష్మి కి వినతిపత్రం అందజేత

ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్05(జనంసాక్షి):-ఆశ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని సిఐటియు జిల్లా కార్యదర్శి చంద్రమోహన్ , సిఐటియు మండల కార్యదర్శి ఎస్ చందు నాయక్ డిమాండ్ చేశారు. తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు యాచారం మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి ముందు ఆశ వర్కర్లు ధర్నా నిర్వహించి అనంతరం డాక్టర్ రాజ్యలక్ష్మి కి మెమోరాండం అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ ఆశ వర్కర్లకు కనీస వేతనం 18000 పెంచి ఫిక్స్డ్ వేతనం నిర్వహించాలని, టిబి స్కూటమ్ డబ్బాలను ఆశాలతో మోపిచకూడదని, టి బి లెప్రసీ కంటి వెలుగు తదితర పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని, తగ్గించాలని విడుదల చేయాలని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. 2021 జులై నుంచి డిసెంబర్ వరకు ఆరు నెలల పిఆర్సి ఏరియార్స్ వెంటనే చెల్లించాలని, కేంద్రం చెల్లించిన కరోనా రిస్క్ అలవెన్స్ నెలకు 1000 చొప్పున 16 నెలల బకాయిలు వెంటనే విడుదల చేయాలని, 32 రకాల రిజిస్టర్ ప్రభుత్వం ప్రింట్ చేసి సప్లై చేయాలని, ప్రసూతి సెలవుల పైన సర్కులర్ వెంటనే జారీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వీరి న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్లు స్వరూప శోభారాణి పద్మ లలిత స్వాతి నాగమణి లక్ష్మమ్మ గరిష జంగమ్మ మమత ముక్తాబాయి బాలమ్మ సువర్ణ నరసమ్మ సుశీల పద్మ బుజ్జి సువర్ణ యాదమ్మ గౌస్య అలివేలు రమాదేవి మంజుల సరూప లలిత గోవిందమ్మ బేగం ప్రమీల వైదేవి బాలమని శోభారాణి గిరిజ సువర్ణ రాణి యాదమ్మ సైదమ్మ స్వరూప తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు