గణేష్ ఉత్సవాలు శాంతితంగా నిర్వహించాలి…. ఎసిపి వెంకట్ రెడ్డి

సెప్టెంబర్ 18 చవితి 27న నిమజ్జనం…. ఉత్సవ సమితి సభ్యులు..

భువనగిరి టౌన్ (జనం సాక్షి):-గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా పోలీస్ శాఖ వారు నిర్వహించిన సమీక్ష సమావేశానికి వివిధ శాఖల అధికారులు ఉత్సవ సమితి సభ్యులు మండపాల నిర్వాహకులతో నిర్వహించడం జరిగిందిఈ సందర్భంగా ఏసీబీ వెంకట్ రెడ్డి గారు మాట్లాడుతూ నవరాత్రి ఉత్సవాలను యువకులు ప్రజలు భక్తిశ్రద్ధలతో పోలీసు వారికి సహకరిస్తూ సమయపాలన పాటిస్తూ ఉత్సవాలు నిర్వహించుకోవాలని తెలియజేశారు,
అదేవిధంగా భువనగిరి గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షులు పట్నం కపిల్ మాట్లాడుతూ బాలగంగాధర్ తిలక్ స్ఫూర్తితో హిందువుల్లో ఐక్యత చైతన్యం గురించి గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకోవాలని సెప్టెంబర్ 18 వినాయక చవితి సెప్టెంబర్ 27న నిమజ్జనం ఉంటుందని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో భువనగిరి పట్టణ సిఐ సుదీర్ చంద్ర , అర్జునయ్య, ఇరిగేషన్ రగవెందర్ , నరేష్ ,మున్సీపల్ ప్రసాద్ , elc అనంతరెడ్డి మరియు వివిధ శాఖ అధికారులు, భువనగిరి గణేశ సమితి సభ్యులు ఆకుల మహేందర్, రాళ్ల బండి కృష్ణ చారి, కనుకుంట్ల రమేష్, కాట్కమోజు ఉషా కిరణ్, శ్రీ శ్రీనివాస్, గీస కొండల్, గొల్లల శ్రీనివాస్, కొంచెం రాజు, నామోజు రాజు చారి ఈసా ఆనంద్ శ్రీశైలం సంతోష్ మల్లేష్ వెంకటేష్ వివిధ పంటపాలెం నిర్వాహకులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు

తాజావార్తలు