పోలీస్ అధికారులతో ఎన్నికలకు సంబంధించి సరిహద్దుల్లో తీసుకోవాల్సిన చర్యల గురించి కోఆర్డినేషన్ మీటింగ్
గద్వాల నడిగడ్డ, సెప్టెంబర్ 5 (జనం సాక్షి);
తెలంగాణ రాష్ట్రo లో రాబోయే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని జిల్లా ఎస్పీ కె. సృజన ఆదేశాల మేరకు డి. ఎస్పీ. పి. వేంకటేశ్వర్లు ఆలంపూర్ చౌరస్తా లోని టోల్ గేట్ దగ్గర ఉన్న అన్నపూర్ణ హోటల్ నందు సరి హద్దు రాష్ట్రాo అయిన ఆంద్ర ప్రదేశ్ లోని కర్నూల్ జిల్లా బోర్డర్ పోలీస్ స్టేషన్ ల పోలీస్ అధికారులతో ఎన్నికలకు సంబంధించి సరిహద్దులో తీసుకోవలసిన పకడ్బందీ చర్యల గురించి కోఆర్డినేషన్ మీటింగ్ నిర్వహించారు.ఈ సంధర్బంగా తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల సరిహద్దు పోలీస్ స్టేషన్ అధికారులు నేరాలకు సంబంధించి సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవాలని, తెలంగాణ లో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎలక్షన్స్ కి సంబంధించి బోర్డర్ లో పకడ్బందీ చెక్ పోస్ట్లు ఏర్పాటుపై పోలీస్ అధికారులు చర్చించారు. మద్యం సరఫరా కు సంబందించి ఎలాంటి అక్రమ రవాణా జరుగకుండా తీసుకోవాల్సిన అంశాల పై చర్చించారు.సరిహద్దు జిల్లాలో ఎక్కడైనా చోరీలు జరిగితే కేసులకు సంబంధించి పోలీసు అధికారులు సమన్వయంతో కలిసి పనిచేసి నేరాల నియంత్రణ కొరకు చర్యలు తీసుకోవాలని అన్నారు. నేరస్థులకు సంబంధించిన ఎలాంటి సమాచారం ఉన్న, అలాగే ఎన్ బి డబ్ల్యూ ఎస్ కు సంభందించిన సమాచారం ఉన్న సరి హద్దు పోలీస్ స్టేషన్ ల అధికారులు ఇచ్చి పుచ్చుకోవాలని ఈ సమావేశంలో చర్చించుకున్నారు .ఈ సమావేశంలో ఆత్మకూరు డి. ఎస్పీ శ్రీనివాస రావు, ఆలంపూర్ సి. ఐ రాజు, ఎమ్మగనూరు సి. ఐ మోహన్ రెడ్డి, కర్నూల్ తాలూకా పోలీస్ స్టేషన్ సి. ఐ శ్రీ రాం, నంది కొట్కూర్ సి. ఐ విజయ్ భాస్కర్, కోడుమూరు సి.ఐ మన్సురుద్దిన్ అలాగే ఆలంపూర్, ఉండవెల్లి, రాజోలి, ఐజ, బ్రహ్మణ కొట్కురు ఎస్సై లు పాల్గొన్నారు.