అసెంబ్లీ ఎన్నికల్లో రెండు అసెంబ్లీ సీట్లు బీసీలకు కేటాయించాలి.
ప్రకటించిన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని మార్చి బీసీలకు ఇవ్వాల్సిందే.
బిసిలకు అసెంబ్లీ టికెట్లు ఇవ్వనటువంటి రాజకీయ పార్టీలను పాతరేద్దాం.
ఓట్లు బిసిలవి-పదవులు అగ్రకులాలకా….
పార్టీలకతీతంగా బీసీల సింహగర్జనను విజయవంతం చేయాలని.
ఈనెల 10న జరిగే బీసీల సింహగర్జన పోస్టర్ ఆవిష్కరణ.బీసీ యువజన సంఘం రాష్ట్ర కార్యనిర్వహక అధ్యక్షులు ఈడిగ శ్రీనివాస్ గౌడ్.
తాండూరు సెప్టెంబర్ 6(జనంసాక్షి) తాండూర్ నియోజకవర్గ కేంద్రంలో బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు అనిల్ కుమార్ ఆధ్వర్యంలో ఈ నెల 10న హైదరాబాదులో జరిగే బీసీల సింహగర్జన గోడపత్రికలనుబుధవారం ఆవిష్కరించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బీసీ యువజన సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు ఈడిగ శ్రీనివాస్ గౌడ్ హాజరై మాట్లాడుతూ సామాజిక న్యాయం – సబండ వర్గాలకు రాజ్యాధికారమే లక్ష్యంగా ఈ నెల 10 వ తేదిన హైదరాబాదులో జరిగే బీసీల సింహగర్జన నిర్వహిస్తున్నామని తెలిపారు, అర శాతం, ఐదు శాతం లేని కులాలకు అధిక టికెట్లు కేటాయిస్తూ ఈ రాష్ట్రంలో సామాజిక న్యాయాన్ని బొంద పెడుతున్నటువంటి రాజకీయ పార్టీలను భారతం పట్టాలని పిలుపునిచ్చారు. వికారాబాద్ జిల్లాలో ఒక ఎస్సీ నియోజకవర్గం వదిలేస్తే మిగతా మూడు నియోజకవర్గాల్లో గత వారంలో ప్రకటించిన బిఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ల పేరుపైన ముగ్గురు అభ్యర్థులను ఒకే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకులకు ఇవ్వడంతో బీసీలకు మోండి చేయి చూపించడం జరిగిందన్నారు. బిఆర్ఎస్ పార్టీని సాకుగా తీసుకుని కాంగ్రెస్ బిజెపి కూడా ఇదే వైఖరిని అవలంబిస్తే బీసీలు ఓటు అనే ఆయుధంతో ఈ అగ్రకుల అహంకార పార్టీలకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఓట్లు బీసీలవి, పదవులు అగ్రకులాలకు కేటాయిస్తూ రాజకీయా పార్టీలు బిసిలను మోసం చేస్తు, ఆయా పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకులు రాజకీయ పార్టీలను ప్రశ్నించాల్సిన అవసరం ఉందన్నారు.ఈ రాష్ట్రంలో ఎవరి జనాభా దామాషా ప్రకారం వారికి సీట్లు కేటాయించే విధంగా అన్ని రాజకీయ పార్టీలపై ఒత్తిడి తీసుకురావడానికి బీసీల ఎజెండాగా 2023 ఎన్నికల నిర్వహించే విధంగా పోరాటం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో యువజన సంఘం నాయకులు బంటు అంజి, వెంకటేష్ గౌడ్, మైనార్టీ సంఘం నాయకుడు అల్తాఫ్, నర్సింలు, వంశీ, శ్రీకాంత్ గౌడ్, రామ్ ప్రసాద్ తదితరులు ఉన్నారు.