పోషణ మాసోత్సవాలు….

చిలప్ చేడ్/సెప్టెంబర్/జనంసాక్షి :- మండలంలోని పలు గ్రామాలలోని గల అంగన్వాడి కేంద్రాలలో పోషణ మాసోత్సవాలు నిర్వహించిన్నారు బుధవారం నాడు సోమక్కపేట అంగన్వాడి కేంద్రంలో పోషణ మాసోత్సవాలు నిర్వహించడం జరిగింది. పోషణ మాసోత్సవాలు ఈనెల 01 నుండి,30 వరకు నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు సోమక్కపేటలో గర్భిణీ బాలింతలకి 1000 రోజుల ప్రాముఖ్యత గురించి గర్భం దాల్చిన దగ్గర నుండి బిడ్డ పుట్టిన రెండు సంవత్సరాల,కాలాన్ని 1000 రోజులు అంటారున్యూట్రిషన్ ఫుడ్ గురించి తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలు ఉన్న ఆహార పదార్థాలు ఎలా తయారు చేసుకోవాలో చెప్పడమే కాకుండా తల్లులకి ఏవిధంగా తయారు చేసుకోవాలో చెప్పడం జరిగింది. రాగి లడ్డు ఎలా తయారుచేయాలో టీచర్స్ చేసి చూపించారు వ్యక్తిగత పరిశుభ్రత గురించి,చేతులు శుభ్రం చేసుకోవడం గురించి చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఐసీడియస్ సూపర్వేజర్ సంతోషిమత పాల్గొన్ని చివరగా అందరితో పోషణ ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. ఈరోజు చిట్కూల్,చిట్కూల్ తాండ,గంగారం, ఫైజాబాద్,అజ్జమర్రి, చండూర్ చిలప్ చేడ్,అంగన్వాడి కేంద్రాలలో, పోషణ మాసోత్సవాల గురించి, వివరిస్తూ, పోషణ ప్రతిజ్ఞ చేయించడం జరిగింది.ఈకార్యక్రమంలో ఉప్పసర్పంచ్ లావణ్య, పంచాయతీ కార్యదర్శి నరేష్, ఏఎన్ఎం అనిత,ఆశవర్కర్ సుజాత, అంగవాడి టీచర్స్ సిద్దమ్మ,ప్రసన్న, బూలి,బాలింతలు, తల్లులు, పిల్లలు పాల్గొన్నారు

తాజావార్తలు