మున్సిపాలిటీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి
జనంసాక్షి, మంథని : మున్సిపాలిటీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని సిఐటియు ఆధ్వర్యంలో బుధవారం మంథని మునిసిపాలిటీ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి అనంతరం మున్సిపాలిటీ కమిషనర్ సిహెచ్.సతీష్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు బూడిద గణేష్ మాట్లాడుతూ.. మున్సిపాలిటీ కార్మికులు ఎదుర్కొంటున్న న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం ఈ నెలలో దశల వారి పోరాటాలు నిర్వహిస్తున్నామని దానిలో భాగంగా మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం అందజేయడం జరిగిందని అన్నారు. మున్సిపల్ కార్మికుల న్యాయమైన డిమాండ్లైన కార్మికులందరిని పర్మినెంట్ చేయడం కనీస వేతనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న మాదిరిగా వేతనం 21 వేలు ఇవ్వాలని అలాగే మరణించిన కార్మికులకు 25 లక్షల ప్రమాద బీమా ఇవ్వాలని 4 లేబర్ కోడులను రద్దు చేయాలని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనాన్ని అమలు చేయాలని అదేవిధంగా స్థానికంగా ఉన్న సమస్యలను పరిశీలించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ నాయకులు గాడిపెల్లి మల్లేష్, చిప్పకుర్తి చందు, సింగారపు గట్టయ్య, ఎడ్ల రాజయ్య, భాగ్య, స్వరూప, కవితలు పాల్గొన్నారు.