ముగిసిన శిక్షణ తరగతులు

జనంసాక్షి, మంథని : పెద్దపల్లి జిల్లా మంథని మండలం నాగారం గ్రామపంచాయతీ పరిధిలో గల రైతు వేదిక భవనంలో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ వారి ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికుల శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థుల వీడ్కోలు సమావేశం నిర్వహించడం జరిగింది . ఇట్టి కార్యక్రమానికి నాగారం గ్రామ సర్పంచ్ బూడిద మల్లేష్ ని ముఖ్య అతిథిగా ఆహ్వానించడం జరిగింది. ఇట్టి సమావేశాన్ని ఉద్దేశించి ట్రైనర్ సంపత్ మాట్లాడుతూ నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ వారి ఆధ్వర్యంలో నాగారం గ్రామంలోని రైతు వేదిక భవనంలో గత 15 రోజులుగా శిక్షణ పొందుతున్న భవన నిర్మాణ కార్మిక అభ్యర్థులు ఈరోజుతో శిక్షణ పూర్తి చేసుకుంటున్నందుకు సంతోషాన్ని వ్యక్తపరిచారు . నేర్చుకున్న విద్య ద్వారా ఉపాధి పొందాలని ఆకాంక్షించారు ఎన్.ఎ.సి ద్వారా శిక్షణ పొంది దేశ విదేశాల్లో అత్యధిక వేతనాలు అందుకుంటున్నారని నాగారంలో శిక్షణ పొందిన వారందరూ ఆ స్థాయికి చేరాలని ఆకాంక్షించారు. భవన నిర్మాణ కార్మికులు కుట్టు మిషన్ అభ్యర్థులకి శిక్షణ ఇవ్వడానికి మాకు ఇంత మంచి భవనము, మౌలిక సదుపాయాలు కల్పించిన గౌరవ సర్పంచ్ కి కృతజ్ఞతలు తెలియజేశారు. సర్పంచ్ మల్లేష్ మాట్లాడుతూ.. గ్రామస్తులకి వివిధ రకాల నైపుణ్యాలలో శిక్షణ ఇవ్వడానికి వచ్చిన ఎన్.ఎ.సి బృందానికి ఎల్లవేళలా సంపూర్ణ సహకారం అందిస్తామని తెలిపారు. నాగారం గ్రామం తో పాటు వివిధ గ్రామాల నుండి వచ్చిన అభ్యర్థులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా గ్రామపంచాయతీ నుంచి మౌలిక వసతులు కల్పించామని తెలిపారు. అభ్యర్థులు ట్రైనర్ల ద్వారా శిక్షణ పొంది ఆర్థికంగా స్థిరపడాలని ఆకాంక్షించారు. అనంతరం ఎన్.ఎ.సి ట్రైనర్లు, శిక్షణ పొందిన అభ్యర్థులు గ్రామ సర్పంచ్ గారికి సన్మానం చేశారు. ఇట్టి కార్యక్రమంలో ఎన్.ఎ.సి ట్రైనర్ సునీత ,పంచాయతీ కార్యదర్శి అనిల్ , గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

తాజావార్తలు