సేవ మరియు క్రమశిక్షణతోనే గుర్తింపు…..

వరంగల్ ఈస్ట్, సెప్టెంబర్ 6 (జనం సాక్షి):ఏ వి వి ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి కొడిమల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నూతన వాలంటీర్లకు ఎన్ఎస్ఎస్ పై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కళాశాల ప్రిన్సిపల్ అండ్ మాజీ సీనియర్ మోస్ట్ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ ఏ భుజంగ రెడ్డి మాట్లాడుతూ ఈ యాంత్రిక జీవితంలో విద్యార్థులకు సేవతో సమాజంతో మమేకం చేసే ఒక గొప్ప ప్రయత్నమే ఎన్ఎస్ఎస్ అని ఇది మహాత్మా గాంధీ ఆశయాలకు అనుగుణంగా ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు సేవ చేయడం ద్వారా అక్కడున్న సమస్యలపై అవగాహన కలిగించి ,సమస్యల పరిష్కారంలో పాలుపంచుకోవడం తద్వారా యువత యొక్క వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించడం జరుగుతుందని అన్నారు . కొడిమాల శ్రీనివాసరావు మాట్లాడుతూ సమాజ సేవ మరియు స్వీయ క్రమశిక్షణతోనే విద్యార్థి యొక్క వ్యక్తిత్వ వికాసం పెంపొందుతుందని మరియు సేవ చేసే భాగ్యము విద్యార్థి దశ నుండే కలిగే అవకాశం ఎన్ఎస్ఎస్ ద్వారా లభిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ప్రోగ్రామ్ ఆఫీసర్లు సంజీవ ,బి గోపి మరియు అధ్యాపకులు డాక్టర్ ఎస్ అనిత, డాక్టర్ శ్రీధర్ వాలంటీర్లు సీనియర్ వాలంటీర్స్ పాల్గొన్నారు.

తాజావార్తలు