ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి

రాష్ట్ర చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్  చింత ప్రభాకర్

స్టార్ సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ ప్రారంభం

 సంగారెడ్డి బ్యూరో ,  జనం సాక్షి ,  సెప్టెంబర్ 6   :ప్రజలందరికీ మెరుగైన వైద్య సేవలు అందుబాటులో ఉండాలని రాష్ట్ర చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. బుధవారం సంగారెడ్డి పట్టణంలోని గణేష్ నగర్ మెయిన్ రోడ్ వద్ద స్టార్ సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ను  చింతా ప్రభాకర్ తో పాటు జెడ్పి చైర్మన్ మంజు శ్రీ జైపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ సత్యనారాయణ, డిసిసిబి వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం, మాజీ ఎమ్మెల్సీ ఆర్. సత్యనారాయణ లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా చింతా ప్రభాకర్ మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు, అత్యాధునిక పద్ధతుల్లో అందించాలన్నారు. సామాన్యులకు వైద్య సేవలు అందు బాటులోకి తీసుకురావాలని, ఇందుకు ప్రభుత్వం అందించే పథకాలను ఉపయోగించుకోవాలని సూచించారు. ప్రజలకు మంచి మెరుగైన సేవలు అందించినప్పుడే ప్రజలకు మెరుగైన సేవలు అందించినప్పుడే హాస్పిటల్కు మంచి పేరు వస్తుందన్నారు. మంజుశ్రీ మాట్లాడుతూ జిల్లా ప్రజలకు అధునాతన వైద్యాన్ని అందించాలనే సత్సంకల్పంతో, లాభాపేక్ష లేకుండా స్టార్ సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ స్థాపించడం హర్షణీయమని కొనియాడారు. ఈ కార్యక్రమం లో  మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ డా. హరి నాయక్, మేనేజింగ్ పార్ట్నర్ పోలీస్ సతీష్ పాటిల్, డాక్టర్లు సుదర్శన్ రెడ్డి, సుధీర్, కుమార్, రోహిత్ రాథోడ్, సునీల్, విజ్ఞత రెడ్డి, ఉష, అలేఖ్య, మహేష్, అభినందన్ రెడ్డి, అరవింద్ సాయి, రాజగోపాల్ రెడ్డి, సురేష్, వికాస్, మున్సిపల్ చైర్మ బొంగుల విజయలక్ష్మి, సిడిసి చైర్మన్ బుచ్చిరెడ్డి, మాజీ సిడిసి చైర్మన్ విజేందర్ రెడ్డి, జెడ్పిటిసి రాజు రాథోడ్, సిడిసి డైరెక్టర్ జైపాల్ నాయక్, సర్పంచ్ మోహన్ నాయక్, కౌన్సిలర్ పవన్, పుల్ సింగ్ నాయక్, రాజేందర్ నాయక్, హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు