ఎమ్మెల్యే పై అసత్య ఆరోపణలు సరికాదు: ఎంపీటీసీ ఆంగోతు ఆమ్లి లచ్చిరాం నాయక్

* సీనియర్లను కాదని ఎంపీపీని చేస్తే విశ్వాసం లేదు
* పదవులు అనుభవిస్తూ ఎమ్మెల్యేను విమర్శించడం తగదు
తిరుమలగిరి (సాగర్ ),సెప్టెంబర్ 06 (జనంసాక్షి): ఎమ్మెల్యే పై అసత్య ఆరోపణలు సరికాదని రంగుండ్ల ఎంపీటీసీ ఆంగోత్ ఆమ్లి లచ్చిరాం నాయక్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలో బి ఆర్ ఎస్ ఎంపీటీసీలతో కలిసి ఆమె పత్రిక సమావేశం ఏర్పాటు చేశారు.ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ గిరిజనుల అభివృద్ధి కోసం అనునిత్యం పాటుపడు తున్న నాగార్జునసాగర్ శాసనసభ్యులు నోముల భగత్ కుమార్ పై తప్పుడు ఆరోపణలు చేసే ముందు తను ఆత్మ విమర్శ చేసుకోవాలని అన్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న భగవాన్ నాయక్, నోముల నరసింహయ్య ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత బిఆర్ఎస్ పార్టీలోకి చేరితే నిన్ను గౌరవించి నీకు , మీ అమ్మ ఆమ్లి నైన నాకు ఒకే ఇంట్లో ఇద్దరికీ ఎంపీటీసీల టికెట్ ఇచ్చి గెలిపించి , సీనియర్లను కాదని నిన్ను ఎంపీపీని చేస్తే ఆ విశ్వాసం మరచి.ఆ కుటుంబం మీద అలాంటి ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసం అన్నారు.నీవు ఏనాడైనా నిన్ను గెలిపించిన నాయకుని తండా ఎంపీటీసీ పరిధిలోని కార్యకర్తలకు కనీస గౌరవం ఇవ్వకుండా, కార్యకర్తలను పట్టించుకోకపోయినా, ఎమ్మెల్యే నిన్ను గౌరవించి ప్రతి అభివృద్ధి సమావేశాలకు పిలుస్తుంటే, ఏనాడు ఎమ్మెల్యే మీద గౌరవం లేకుండా మీటింగుకు హాజరుకాకుండా ఉన్నది నిజం కాదా అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఘనంగా గిరిజనుల ఆరాధ్య దైవం అయినా సంతు సేవలల్ జయంతిని అధ్యక్షతన జరుపుతుంటే కాంగ్రెస్ బిజెపి నాయకులతోటి పక్కన పోటీగా కార్యక్రమం జరిపి ప్రభుత్వం పార్టీని పరువు తీయడం నిజం కాదా, మెజార్టీ మండలాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లడానికి కృషి చేస్తుంటే, నీవు ఒంటెద్దు పోకడలు పోతున్నా నీ వ్యక్తిగత అభిప్రాయాలు ఎవరో మిమ్మల్ని ప్రేరేపిస్తే ఎమ్మెల్యే పై అసత్య ఆరోపణలు చేస్తున్నావు, ఏదో కొన్ని పార్టీలు , యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూలు ఇస్తూ బిఆర్ఎస్ పార్టీపై, ఎమ్మెల్యే పై అసత్య ఆరోపణలు చేయడం సరి కాదని ఇప్పటికైనా నీవు ఆత్మ విమర్శ చేసుకోవాలని, మరోసారి ఇదే విధంగా చేస్తే మేము మిమ్ములను, మీరు చేసిన పార్టీ వ్యతిరేక కార్యకలాపాలను ఎండగడతామని, తీరు మార్చుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమం లో మండల పార్టీ అధ్యక్షులు పిడిగం నాగయ్య,ఎంపిటిసిలు పెదమాము కాశయ్య ,బాసిరెడ్డి భార్గవి శ్రీనివాసరెడ్డి, జాటావత్ సుజాత పాండు నాయక్,రమావత్ స్వాతి, సభావత్ రాకేష్, మండల ప్రధాన కార్యదర్శి పోతుగంటి తిరుమల్,గరికనట్ తండా సర్పంచ్ బిచ్చ నాయక్,గ్రామ శాఖ అధ్యక్షులు షాగం అంజిరెడ్డి,యూత్ అధ్యక్షులు జటావత్ రమేష్ నాయక్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ బూడిద హరికృష్ణ, రైతు సమన్వయ అధ్యక్షులు పగడాల పెద్దిరాజు, నాయకుని తండా గ్రామ శాఖ అధ్యక్షులు మేరావత్ శ్రీను,పాండు నాయక్, మేరావత్ రవి, వెంకట్ రామ్, గోవింద్, రాజమాల్, విక్రమ్, సంగ్య, అకాష్, నాయకులు బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

తాజావార్తలు