ఇంటింటికి పిడికెడు మట్టి సేకరణలో పాల్గొన్న డీకే అరుణ

మల్దకల్ సెప్టెంబర్ 6 (జనంసాక్షి) :మల్దకల్ మండల పరిధిలోని మల్లెందొడ్డి గ్రామంలోమట్టి సేకరణ కార్యక్రమంలో బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డికె. అరుణమ్మ పాల్గొన్నారు. బుధవారం_నా భూమి నా దేశంమట్టి సేకరణ కార్యక్రమంలో మల్దకల్ మండల బిజెపి అధ్యక్షులు పాల్వాయి రాముడు ఆధ్వర్యంలో ఇంటింటికి పిడికెడు మట్టి సేకరణలో పాల్గొని ఆమె మాట్లాడుతూ బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డికె. అరుణమ్మ మాట్లాడుతూ స్వాతంత్రం సాధించుకొని 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న ఆజాదికా అమృత్ మహోత్సవం ముగింపులో భాగంగా మన గ్రామంలో అమర జవాన్లు,పోలీస్ అమరవీరులను,స్వాత్రంత్ర పోరాట యోధులను స్మరించుకుంటు ప్రతి గ్రామం నుండి మట్టిని సేకరించాలని తెలియజేశారు.దేశవ్యాప్తంగా అన్ని గ్రామాలలో మట్టి సేకరణ ప్రారంభం అవుతుందని,మట్టి సేకరణ అనంతరం గ్రామాలలో ఉన్న స్కూళ్ల,ప్రభుత్వ కార్యాలయంలో రోడ్లకు ఇరువైపులగ్రామ గ్రామాన 75 మొక్కలు నాటాలని అన్నారు.జిల్లా కేంద్రానికి ఈనెల15వ తేదీ ప్రతి మండలం నుంచి మట్టి కలశాలు తీసుకురావాలని చెప్పారు.జిల్లాల నుంచి వెళ్లినటువంటి మట్టి కలుషాలను ఈనెల 25వ తేదీ న రాష్ట్రాలకు వెళ్తాయని రాష్ట్రాల నుంచి సేకరించినటువంటి కలుశాలను ఈనెల 29,30న ఢిల్లీకి వెళుతుందని ఢిల్లీకి వెళ్లిన అనంతరం ఆమట్టితో అమృతవాటికను నిర్మిస్తారని తెలిపారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గడ్డం క్రిష్ణ రెడ్డి,సీనియర్ నాయకులు,పెదొడ్డి రామకృష్ణ,దామ వెంకటేష్,లక్ష్మీనారాయణ, గోపాల్ రెడ్డి,నరసింహరెడ్డి, ఖాజా మొయినుద్దీన్, యాదగిరి,లక్ష్మన్న,కిష్టాన్న, పరుష,పవన్,హనుమన్న తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు