తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్న బిఆర్ఎస్ ప్రభుత్వం

మల్కాజిగిరి,జనంసాక్షి. సెప్టెంబర్ 6:నీళ్లు, నిధులు, నియమాకలు అని చెప్పి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం యువతకు ఉద్యోగాలు ఇవ్వకుండా, కెసిఆర్ కుటుంబానికి మాత్రం ఉద్యోగాలు తెచ్చుకుని తెలంగాణ ప్రజలను అన్ని రకాలుగా మోసం చేస్తున్నారని మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం ఇన్చార్జిగా నూతనంగా నియమింపబడ్డ కర్ణాటక  శివాజీ నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే రిజ్వాన్ హర్షత్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా డిసిసి అధ్యక్షుడు నంది కంటి శ్రీధర్ విమర్శించారు.బుధవారం మౌలాలి పరిధిలోని క్లాసిక్ గార్డెన్లో నిర్వహించినమల్కాజిగిరి నియోజకవర్గం ముఖ్య కార్యకర్తల సమావేశానికి వారు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఈనెల16, 17న హైదరాబాదులో సి డబ్ల్యూ సి సమావేశాలు జరగనున్నాయని 17న సాయంత్రం నిర్వహించే బహిరంగ సభలో సోనియాగాంధీ ఐదు గ్యారెంటీ కార్డు స్కీములను ప్రకటిస్తారని తెలిపారు.ఈ సభ ద్వారా తెలంగాణ కాంగ్రెస్ దేశానికి గొప్ప సందేశాన్ని ఇవ్వబోతున్నారు అని అన్నారు.తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు అని విమర్శించారు.ఈ కార్యక్రమంలో ఏ, బి, బ్లాక్ అద్యక్షులు అశోక్ రెడ్డి, వెంకటేష్ యాదవ్, సిరిగిరి నర్సింగరావు, గౌస్ బై, చంద్రశేఖర్ , ఉమామహేశ్వరి యాదవ్, శ్రీనివాస్ గౌడ్, గుత్తి రాంచందర్, వినోద్ యాదవ్, సానాది శంకర్, మెహమూద్ అలీ, ఉమేష్ సింగ్, వంశీ ముదిరాజ్, వైనాల ప్రవీణ్, ఎమ్మార్ శ్రీనివాస్ యాదవ్, రెబ్బ వాసు, చాకో, బి కే శ్రీనివాస్, శ్యామ్ రావు, రాజేందర్,కుట్టి శ్రీనివాస్ యాదవ్, కృష్ణ గౌడ్,  పవన్, బుచ్చిబాబు, మాజీద్, గఫూర్, నరేందర్ గౌడ్, సురేష్ సింగ్, నాగరాజ్, ఆశ ప్రభ నవనీత శైలజ భాగ్యమ్మ, మాధవి నిర్మల తదితరులు పాల్గొన్నారు.

 

తాజావార్తలు