ముదిరాజ్ లకు ఒక్క ఎమ్మెల్యే సీటు కేటాయించకపోవడం అన్యాయం
– బిఆర్ఎస్వి మాజి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి,
ముదిరాజ్ మహాసభ నియోజకవర్గ ఇంచార్జీ అట్టెం రమేష్ ముదిరాజ్
– మంథని లో అట్టెo రమేష్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ
జనంసాక్షి మంథని : ఇటీవల బిఆర్ఎస్ పార్టీ ప్రకటించిన 115 మంది ఎమ్మెల్యే టిక్కెట్ల కేటాయింపుల్లో 50 లక్షల జనాభా కలిగిన ముదిరాజ్ కులానికి ఒక్కటి కూడా ఎమ్మెల్యే టికెట్ కేటాయించక పోవడం అన్యాయమని బిఆర్ఎస్వి మాజి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, ముదిరాజ్ మహాసభ నియోజకవర్గ ఇంచార్జీ అట్టెం రమేష్ ముదిరాజ్ అన్నారు. బుధవారం పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గ కేంద్రంలో ముదిరాజ్ కులస్తులతో నిరసన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అనంతరం మంథని పట్టణంలో ఉన్న జ్యోతి రావ్ పూలే విగ్రహానికి పూల మాల వేసారు. ర్యాలీ చివరన అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ముదిరాజ్ మహాసభ నియోజకవర్గ ఇన్చార్జి, బిఆర్ఎస్ వి మాజి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి అట్టెం రమేష్ ముదిరాజ్ మాట్లాడుతూ… బిఆర్ఎస్ పార్టీ జెండాలు మోసిన ముదిరాజ్ కులస్తులకు టికెట్టు కేటాయించకపోవడం శోచనీయమన్నారు. బిఆర్ఎస్ పార్టీ మీటింగ్ పెట్టిన అట్టి మీటింగ్ ను విజయవంతం చేయడంలో ముదిరాజ్ కులస్తులు గొప్ప పాత్ర పోషించారని అలాంటి కులానికి ఒక్క టికెట్ కూడా కేటాయించక పోవడం బాధాకరమన్నారు. తెలంగాణ కోసం తొలి అమరుడు కానిస్టేబుల్ కిష్టయ్య ముదిరాజ్ అని, ముదిరాజ్ కులస్తుల ఓట్లతో రెండుసార్లు బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందన్నారు. 119 నియోజక వర్గాల్లో ముదిరాజ్ లు 20 నియోజకవర్గాల్లో మా ఓట్లు వేసుకుంటే గెలుస్తామని ఇంకో 40 స్థానాల్లో ఒకటి ,రెండు కులాలను కలుపుకుంటే 30 నియోజకవర్గాల్లో గెలుపు ఓటములు డిసైడ్ చేస్తామని తెలిపారు. మంథనిలో కూడా నలభై వేయిల జనాభా ఉందని గుర్తు చేశారు. మా కులానికి చేసిన అన్యాయాన్ని తట్టుకోలేక పోతున్నామని, గత 18 సంవత్సరాల నుండి పార్టీ లో పనిచేస్తు గతంలో బిఆర్ఎస్ వి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గా పార్టీలో పని చేశానని,మమ్మల్ని చిన్న చూసినందుకు రాజీనామా చేస్తున్నా అని మీడియా ముఖoగా ప్రకటించారు. బిసి బంధు అందరికీ ఇస్తూ మాకు ఇవ్వక పోవడం ఏమిటి అని ప్రశ్నించారు. ఈ సమావేశంలో మంథని మండల బాధ్యులు ,రామగిరి ,మలహార్ , మంథని, మహా ముతారo ,కమాన్ పూర్, ముతారo మండలాల నుండి మూడు వందల మంది వరకు పాల్గొన్నారు.