బాల్య వివాహాల నిర్మూలన అవగాహన సదస్సు ను నిర్వహించిన కైలాష్ సత్యార్థి చిల్డ్రన్ ఫౌండేషన్
—షేర్ స్వచ్ఛంద సంస్థ
మహబూబాబాద్, టౌన్ ( సెప్టెంబర్ 6 ) జనం సాక్షి న్యూస్ :
నేడు కైలాష్ సత్యార్థి చిల్డ్రన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విలేజ్ రెడ్యాల లోని ఆశ్రమ పాఠశాల, బాయ్స్ హై స్కూల్ నందు బాలల సమస్యలపై, బాల్య వివాహాల నిర్మూలన పైన అవగాహన కార్యక్రమం నిర్వహించగా కార్యక్రమానికి షేర్ ఎన్జీవో కమ్యూనిటీ మొబిలైజర్లు హిమబిందు, భాస్కర్, సఖి లీగల్ అడ్వకేట్ ఉష హాజరవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వారు ఉమ్మడిగా మాట్లాడుతూ బాల్య వివాహాలు, బాలల ఆక్రమ రవాణా, బాలలపై లైంగిక వేధింపుల నివారణ, చిన్న వయసులోనే బాల్య వివాహాలు, ఫోక్సో చట్టం గురించి విద్యార్థులకు వివరిస్తూ 1098,100,1800 పిల్లలు అప్రమత్తంగా ఉండాలని వివరిస్తూ అత్యవసర సమయంలో, పైన సూచించబడిన నెంబర్స్ ద్వారా సహాయం పొంద వచ్చు నని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయినిలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొనడం జరిగింది.