డోర్నకల్ పోలీస్ స్టేషన్ ను సందర్శించి, తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ చంద్ర మోహన్
పెండింగ్లో ఉన్న కేసులను త్వరగా పూర్తి చేయాలి
-విధులు బాధ్యత రైతంగా నిర్వహించి ప్రజల మన్ననలు పొందాలి
– జిల్లా ఎస్పీ చంద్రమోహన్
డోర్నకల్, సెప్టెంబర్-6, జనం సాక్షి న్యూస్: బుధవారం మహబూబాబాద్ జిల్లా నూతన ఎస్పీ చంద్ర మోహన్ డోర్నకల్ పోలీస్ స్టేషన్ ను సందర్శించి పోలీస్ స్టేషన్ పరిధిలో ను, పరిసరాలను, రికార్డ్స్ ను మరియు సర్కిల్ ఆఫీసు లో సిబ్బంది నిర్వహిస్తున్న విధులను తనిఖీ చేసి పరిశీలించారు.5ఎస్ అమలు తీరును పరిశీలించారు.పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదయిన గ్రేవ్ కేసెస్ యొక్క సిడి ఫైల్స్ ను పరిశీలించి, పెండింగ్లో ఉన్న కేసులను త్వరగా పూర్తిచేయాలని, అయా కేసులలో పట్టుబడిన ప్రాపర్టీ నీ కోర్టులో డిపాజిట్ చేసి, క్లోజ్ అయిన కేసెస్ లో కోర్ట్ అనుమతితో డిస్పోసల చేయాలని సూచించారు.ఈ సందర్భంగా ఎస్పీ సిబ్బందితో మాట్లాడుతూ 5ఎస్ ను ఎవరి పరిధిలో వారు నిత్యం అమలు అయ్యేటట్లు చూసుకోవాలని, స్టాఫ్ కు ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకవచ్చి పరిష్కరించుకోవాలని సూచించారు.మహిళ అధికారులకు రెస్ట్ రూమ్ సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఎంత మంది సిబ్బంది ఉన్నారు, వారు ఏఏ విధులు నిర్వహిస్తున్నారో పరిశీలించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో ఎక్కువగా ఎలాంటి కేసులు నమోదు అవుతున్నాయో పరిశీలించారు.రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రణాళికతో పకడ్బందీగా విధులు నిర్వహించాలని సూచించారు. బ్లూ కోల్ట్స్, పెట్రో కార్స్ విధులు నిర్వహిస్తున్నాయని, తెలుసుకొని ప్రాపర్ గా పెట్రోలింగ్ నిర్వహిస్తూ దొంగతనాలు జరగకుండా చూసుకోవాలని ఆదేశించారు.సిబ్బంది అందరూ బాధ్యత యుతంగా విధులు నిర్వహించి ప్రజల మన్ననలు పొందాలని సిబ్బందికి సూచించారు. ఆయన వెంట సీఐ ఉపేందర్ రావు, ఎస్సై లు సంతోష్ రావు, ఝాన్సీ, ఏఎస్ఐ, సిబ్బంది లు ఉన్నారు.