హిందు వాహిని ఆధ్వర్యంలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు
భైంసా రూరల్ జనం సాక్షి సెప్టెంబర్07:నిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గం భైంసా పట్టణంలోని బుధవారం రాత్రి హిందు వాహిని ఆధ్వర్యంలో కిసాన్ గల్లీలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ మరియు కాలనీలోని రామ్ లీలా మైదానంలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు జరిగాయి కిసాన్ గల్లీలోని రంజిత్, వెంకట్, విగ్నేష్ ఆధ్వర్యంలో కబడ్డీ పోటీలు ఊట్టి కొట్టే కార్యక్రమం నిర్వహించారు కబడ్డీ పోటీలో గెలిచిన వారికి మొదటి బహుమతిగా గెలిచిన ఖానాపూర్ టీంకు పెండపు కాశీనాథ్20000 అందజేశారు రెండవ బహుమతి గెలిచిన జైశ్రీరామ్ యూత్ ముధోల్ టీంకు వడ్నపు శ్రీనివాస్ 10000 గెలిచిన వారికి అందజేశారు అలాగే రామ్ లీలా మైదానంలో చరణ్ అనిల్ శివకుమార్ ఆధ్వర్యంలో కబడ్డీ పోటీలు ఊట్టి కొట్టేనిర్వహించారు కలగడ్డా వార్ సూర్యనారాయణ మొదటి బహుమతిగా గెలిచిన భగత్ సింగ్ యూత్ టీంకు మహిషా 10000అందజేశారురెండవ బహుమతిగా దొడర్న తాండ టీంకు చందూలాల్ 5000 గెలిచిన వారికి అందజేశారు కృష్ణ జన్మాష్టమి వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను పురస్కరించుకొని బాలురు శ్రీ కృష్ణ వేషధారణలో, ఉత్సాహంగా ఉట్టి కొట్టి నృత్యాలు చేస్తూ అందరిని అలరింపజేశారు శ్రీకృష్ణుని అవతారం గురించి మరియు అతని జన్మస్థలం విశిష్టతను అందరికీ తెలియజేశారు.