విద్యాశాఖలో పనిచేస్తున్న సమగ్ర శిక్ష కాంట్రాక్టు ఉద్యోగులను తక్షణమే రెగ్యులరైజ్ చేయాలి
– టిపిసిసి రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ కురువ విజయ్ కుమార్.
గద్వాల నడిగడ్డ, సెప్టెంబర్ 7 (జనం సాక్షి);విద్యాశాఖలో పనిచేస్తున్న సమగ్ర శిక్ష కాంట్రాక్టు ఉద్యోగులను తక్షణమే రెగ్యులరైజ్ చేయాలని టి పి సి సి రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ కురువ విజయ్ కుమార్ అన్నారు.జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో గురువారం తెలంగాణ సమగ్రశిక్ష అభియాన్ ఉద్యోగుల ధర్నాలో టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి డా.కురువ విజయ్ కుమార్ మాట్లాడుతూ గత 10 సంవత్సరాల నుండి సమగ్రశిక్ష అభియాన్ లో నియమితులై డీఈవో, ఎంఆర్సి స్కూల్ కాంప్లెక్స్ లలో పనిచేస్తూ తెలంగాణ రాష్ర్ట విద్యా వ్యవస్థ కు గుండె కాయ లాగా మారి వారు నియమితులైన డ్యూటీ లకు మాత్రమే పరిమితం కాకుండా విద్యా శాఖ అధికారులు అప్పజెప్పిన ప్రతి పనినీ ఎంత కష్టమైన వారి మోము లో నవ్వును చెరుగనీవకుండా బాధలను, కుటుంబ సమస్యలను గుండెల్లోనే దాచుకొని తెలంగాణ రాష్ట్ర ఎస్ ఎస్ ఏ కోసం 10 సంవత్సరాలుగా అహర్నిశలు శ్రమిస్తున్న వేలమంది సమగ్ర శిక్షా ఉద్యోగ సోదర సోదరి మణులు వారి అస్తిత్వం కోసం నేడు ఆఫీస్ లను వదిలి రోడ్డున పడ్డారంటే వారి పడే భాధలు ఎలా ఉన్నాయో ఈ రోజు రోడ్ల మీదకు వచ్చి పడుతున్న ఇబ్బందులను అర్తం చేసుకోవచ్చు అని ఆయన అన్నారు.తెలంగాణ వస్తే కాంట్రాక్టు వ్యవస్థనే రద్దు చేస్తానన్న ముఖ్యమంత్రి మాట తప్పిన కెసిఆర్ ను ఇంటికి పంపాలని విజయ్ కోరారు. స్థానిక ఎమ్యెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఇక్కడి మన ఓట్ల తో గెలిచిన ఎమ్యెల్యే ఉద్యోగం ఊడడం వలన తన ఉద్యోగాన్ని కాపాడుకునేందుకు కోర్టుల చుట్టూ తిరుగుతూ మన ఉద్యోగుల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లకుండా అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు.మీసమస్యను మా పార్టీ నాయకత్వంతో చర్చించి పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో చేర్పి చేర్పిస్తామని మాట ఇస్తున్నానన్నారు.రాబోయే 100 రోజులలో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది అని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే మీసమస్యను పరిసారిస్తామని డాక్టర్ కురువ విజయ్ కుమార్ అన్నారు.