ప్రజా ఆశీర్వాద యాత్రకు కొప్పుల శ్రీకారం….


ధర్మపురి ( జనం సాక్షి ):తెలంగాణ రాష్ట్రంలో రానున్న ఎన్నికలకు బి ఆర్ఎస్ పార్టీ సిద్ధమైంది.ధర్మపురి ప్రదాత రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ నియోజకవర్గంలో ప్రజా ఆశీర్వాద యాత్రను ఆయన ప్రారంభించగా గురువారం ఉదయం ధర్మపురి పట్టణ కేంద్రంలో శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకొని తదనంతరం తహశీ ల్దార్ కార్యాలయం ముందు నుండి యాత్రను ప్రారంభించారు.దారి పొడవున మంత్రికి పూలాభిషేకంతో దారి పొడవున ప్రారంభిస్తూ ప్రచార యాత్రతో ఆయన గడపగడపకు వెళుతున్న మంత్రికి మహిళలు బొట్టు పెట్టి ఆశీర్వదిస్తున్నారు అనంతరం వల్లభాయ్ పటేల్ చౌరస్తా వద్ద మంత్రి మాట్లాడుతూ,
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు ప్రజలకు వివరిస్తూ,వృద్ధాప్య పింఛన్లు బీఈడీ కార్మికుల పింఛన్లు, నేత కార్మికుల పింఛన్లు, తెలంగాణ డయాలసిస్, ఉచిత డయాలసిస్ కార్యక్రమం, వితంతువులకు పింఛన్లు, దివ్యాంగులకు పింఛన్లు, బోదకాలు బాధితులకు పింఛన్లు, అమ్మబడి, ఆరోగ్యశ్రీ అత్యవసర, ఆరోగ్య రవాణా, ఒంటరి మహిళలకు ఫించన్లు, ఆసరా పింఛన్లు, బస్తీ దావకానలు, ఎంప్లాయిస్ అండ్ జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్, కళాకారులకు పింఛన్లు, రైతుబంధు, లక్ష ₹ రూ. రుణమాఫీ, కళ్యాణ లక్ష్మి, కెసిఆర్ కిట్టు, బీసీ బందు, దళిత బంధు ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి ఇంటికి చేరుతున్న ప్రభుత్వ పథకాలు అమలవుతున్నాయని వివరిస్తూ ముందుకు సాగారు. మంత్రి వెంట ప్రజా యాత్రలో డీసీఎంఎస్ చైర్మన్ డాక్టర్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ సంగి సతే మ్మ, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ అయ్యోరి రాజేష్ కుమార్, మున్సిపల్ వైస్ చైర్మన్ ఇందారపు రామన్న జెడ్ పి టి సి బత్తిని అరుణ, ఎంపీపీ ఎడ్ల చిట్టిబాబు,కౌన్సిలర్లు మహిళలు కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్రచారంలో పాల్గొన్నారు.

తాజావార్తలు