ఆధర్మం పై పోరాటం, ధర్మ సంరక్షణ కై కంకణ బద్ధులు కావడం.శ్రీ కృష్ణుడి జీవితం మనకు ఆదర్శం

కృష్ణాష్టమి వేడుకలో పాల్గొన్న బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్.
తాండూరు సెప్టెంబర్ 7(జనంసాక్షి):తాండూరు పట్టణంలోని విశ్వ వేధ హై స్కూల్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కృష్ణాష్టమి వేడుకలలో ముఖ్య అతిథిగా రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్ పాల్గొని మాట్లాడుతు ఆధర్మంపై పోరాటం ధర్మ సంరక్షణ కై కంకణ బదులు కావడం, ధర్మబద్ధమైన జీవితం నిరంతరం అధ్యాయనం అని తెలిపారు. శ్రీకృష్ణుని జీవితం నుండి మనం అనుసరించాల్సిన ఆచరించాల్సినవి మరియు శ్రీకృష్ణడు రచించిన శ్రీ భగవద్గీత ప్రపంచానికి మార్గ నిర్దేశం అని అందరి ఆధారబిమానాలు పొందుతుందన్నారు. ఇది ఏ కులానికి ఏ మతానికో సంబంధించినది కాదు అని సమస్త మానవాళికి ఆదరిస్తుందని ఈ భగవద్గీత అని తెలిపారు. చిన్నారులు రాధా కృష్ణుల పాత్రలలో , అలరించిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేసి ఎంతో చూడముచ్చటగా రాధాకృష్ణ పాత్రలలో ఆడి పాడిన విద్యార్థులకు అభినందనలు తెలియజేస్తూ, భవిష్యత్తులో విద్యార్థులందరూ విద్య ఫలితాలలో మొదటి స్థానంలో ఉండాలని, ఉన్నతమైన శిఖరాలు అధిరోహించాలని, పాఠశాలకు, గురువులకు, తల్లిదండ్రులకు, మంచి పేరు తీసుకురావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ నారాయణరెడ్డి,పాఠశాల యజామాన్యం ,ప్రిన్సిపాల్ కరస్పాండెంట్ గణేష్, పి. సుజాత ప్రిన్సిపాల్ జి. వెంకటేష్,మరియు ఉపాధ్యాయులు విద్యార్థులు శుభ ప్రద్ పటేల్ యువసేన సభ్యులు బాలు, భాను, శ్రీశైలం, విజయ్ , నరేష్ గౌడ్ సచిన్, నరేష్ , చావుస్ పాల్గొన్నారు.