నల్లూరులో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
జనం సాక్షి ముప్కాల్ సెప్టెంబర్ 10 తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు వేముల ప్రశాంత్ రెడ్డి నల్లూరు గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన మరియు ప్రారంభోత్సవాలు నిర్వహించారు గ్రామంలో 11 కెవి సబ్ స్టేషన్ ప్రారంభించారు అనంతరం గ్రామానికి సంబంధించిన నిజాంసాగర్ కెనాల్ పునర్నిర్మాణము అభివృద్ధి కొరకు 14 లక్షలు తో పనులను ప్రారంభించారు మరియు కుల సంఘాలకు సంబంధించి ప్రోసిడింగ్లను రిలీజ్ చేశారు భవిష్యత్తులో కూడా ఇంతకంటే ఎక్కువ అభివృద్ధి పనులను చేపట్టేందుకు తిరిగి తమకు అవకాశం ఇవ్వాలని కోరారు అనంతరం టిఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ప్రశాంత్ రెడ్డి తో పాటు జడ్పిటిసి నరసవ్వ నర్సారెడ్డి ఎంపీపీ పద్మా వెంకట్ రెడ్డి మండల అధ్యక్షుడు భూమేశ్వర్ రెడ్డి నల్లూరు గ్రామ కమిటీ అధ్యక్షులు రఘునాథ్ యువ కమిటీ అధ్యక్షులు సాయికుమార్ మహేష్ ఎంపీటీసీ సత్యనారాయణ సర్పంచ్ సుగుణ నారాయణ ఉపసర్పంచ్ స్రవంతి నవీన్ ఎక్స్ ఎంపీపీ అర్గుల రాధా పొట్టి నరసయ్య వార్డుమెంబర్లు గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు పుట్టి ప్రదీప్ రాజకుమార్ నరేష్ గణేష్ జంగం గోపి మైనారిటీ సెల్ అధ్యక్షులు సమాద్ మైనారిటీ కార్యకర్తలు సొసైటీ డైరెక్టర్ భూమేశ్వర్ టిఆర్ఎస్ కార్యకర్తలు పలు కుల సంఘాల పెద్దలు సర్వ సంఘం ప్రతినిధులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు