పోలీసుల ఆధ్వర్యంలో రోడ్డుకు మరమ్మత్తులు.
చిట్యాల సెప్టెంబర్ 10 (జనంసాక్షి) ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మండలంలోని జడల్ పేట, భీష్మ నగర్ గ్రామాల వద్ద ఉన్న రోడ్డు ధ్వంసం కాగా ఆదివారం పోలీసుల ఆధ్వర్యంలో రోడ్డుకు మరమ్మతులు చేపట్టి ప్రశంసలు అందుకున్నారు. జిల్లా ఎస్పీ పుల్ల కరుణాకర్ ఆదేశాల మేరకు సిఐ వేణు చందర్ సౌజన్యంతో ఎస్సై రమేష్, శాఖహాన్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది మొరంపోసి చదును చేయించారు. పోలీసులు ప్రత్యేక చొరవ తీసుకొని రోడ్డుకు మరమ్మతులు చేపట్టడం వల్ల గ్రామాల ప్రజలు, ప్రయాణికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో చిట్యాల పోలీస్ సిబ్బంది లాల్ సింగ్, నవీన్, లింగన్న, ప్రశాంత్, టిఎస్ఎస్ పి సిబ్బంది పాల్గొన్నారు.