చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలి.

చిట్యాల సెప్టెంబర్ 10 (జనంసాక్షి) చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలని రజక సంక్షేమ సంఘం అధ్యక్షుడు ముస్సాపురి కుమారస్వామి, ఉపాధ్యక్షుడు ఉప్పల కిరణ్ అన్నారు. మండల కేంద్రంలో ఆదివారం వీరవనిత చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలను పురస్కరించుకొని ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం వారు ఈ సందర్భంగా మాట్లాడుతూ భూమికోసం, భుక్తి కోసం విశ్రమించని పోరాటాలు చేసిన వీరవనితగా అభివర్ణించారు.ఆమె ఆశయాలనం కొనసాగించడానికి రజకులంతా ఐక్యం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా మండల నాయకులు కొత్త శ్రీనివాస్, ముస్సాపురి రమేష్ ,కిషన్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు