ఏకశిలా ఇన్ఫ్రా డెవలపర్స్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే
జనం సాక్షి నర్సంపేటనర్సంపేట పట్టణంలోని నెక్కొండ రోడ్డు నందు ఆదివారం రోజున ఏకశిలా డెవలపర్స్ వారి ఆధ్వర్యంలో డెవలప్మెంట్ ఏర్పాటు చేయబడిన ఏకశిలా ఎన్ క్లేవ్ ను ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏకశిలా డెవలప్మెంట్ యజమానులు కుంభం కోమల్ రెడ్డి, ముచింపుల రాజు లు మాట్లాడుతూ నమ్మకానికి మారు పేరు ఏకశిల డెవలపర్స్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడిన ఏకశీల ఎన్ క్లేవ్ లో మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఫ్లాట్ల నిర్మాణం చేశామన్నారు. 40 ఫీట్ల రోడ్డు డ్రైనేజీ, వాటర్ , కరెంటు అన్ని హంగులతో కస్టమర్లకు ఇబ్బంది లేకుండా వారి సౌకర్యార్థం ఫ్లాట్లను ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నియోజకవర్గ నాయకులు నల్ల మనోహర్ రెడ్డి, రాయిడి రవీందర్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ నాయకులు వై ఎస్ ఆర్ ఉమ్మడి జిల్లా పార్టీ అధ్యక్షుడు నాడెం శాంతి కుమార్ మున్నూరు కాపు ఉపాధ్యక్షుడు గట్టు ఆనంద్ కుమార్ కస్టమర్లు తదితరులు పాల్గొన్నారు