అంగన్వాడిల డిమాండ్లను తక్షణం పరిష్కరించాలి.

ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి కడారి రాములు.

-ఆర్డీవో కార్యాలయం దీక్షలు.

రాజన్న సిరిసిల్ల బ్యూరో. సెప్టెంబర్ 11 (జనంసాక్షి). అంగన్వాడి టీచర్ల హెల్పర్ల డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని ఏ ఐ టి యు సి జిల్లా కార్యదర్శి కడారి రాములు డిమాండ్ చేశారు. సోమవారం తెలంగాణ అంగన్వాడి టీచర్స్ హెల్పర్స్ జయంట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఆర్డీవో కార్యాలయం ఎదుట నిరవధిక దీక్షలను ప్రారంభించారు . ఈ సందర్భంగా కడారి రాములు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అంగన్వాడీల డిమాండ్లను పరిష్కరించాలని అన్నారు. న్యాయమైన డిమాండ్ల సాధన కోసం అంగన్వాడి టీచర్లు హెల్పర్లు చేస్తున్న నిరవధిక దీక్షలు సమస్యలు పరిష్కరించేంత వరకు కొనసాగుతాయని అన్నారు. కార్యక్రమంలో సిపిఐ సీనియర్ నాయకులు సామల మల్లేశం, పంతం రవి, వేణు జిల్లాలోని అన్ని మండలాల నుండి భారీ సంఖ్యలో అంగన్వాడి టీచర్లు హెల్పర్లు పాల్గొన్నారు

తాజావార్తలు