అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై బిఆర్ఎస్ పార్టీలో చేరిక
మోత్కూరు సెప్టెంబర్ 11 జనంసాక్షి : బిఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై ఆదివారం మున్సిపాలిటీ కేంద్రంలో తుంగతుర్తి శాసనసభ్యులు డా.గాదరి కిశోర్ కుమార్ సమక్షంలో మోత్కూరు మండలంలోని పనకబండ, రాగిబావి గ్రామాల నుండి వివిధ పార్టీలకు చెందిన గురజాల వీరస్వామి, లోతుకుంట ఎల్లయ్య, లోతుకుంట నాగమ్మ, బట్టు మహేష్, గురజాల ఎలందర్, రాంపాక రాములు, రాజు, నరేష్, గణేష్ వారితో పాటు పలువురు నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. నూతనంగా బిఆర్ఎస్ పార్టీలోకి చేరిన వారిని ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు పొన్నెబొయిన రమేష్, మాజీ మార్కెట్ చైర్మన్ కొనతం యాకుబ్ రెడ్డి, మాజీ మార్కెట్ చైర్మన్ తీపి రెడ్డి మెగా రెడ్డి,సింగిల్ విండో చైర్మన్ కంచర్ల అశోక్ రెడ్డి, రైతుబంధు సమితి మండల కో ఆర్డినేటర్ కొండ సోమల్లు, మదర్ డైరీ డైరెక్టర్ రచ్చ లక్ష్మీ నరసింహ రెడ్డి, మాజీ ఎంపిటిసి పానుగుల విష్ణుమూర్తి, పనకబండ సర్పంచ్ బత్తిని తిరుమలేష్, రాగి బావి సర్పంచ్ రాంపాక నాగయ్య, గ్రామ శాఖ అధ్యక్షుడు లోతుకుంట స్వామి, సోషల్ మీడియా కోఆర్డినేటర్ పొన్నెబొయిన మచ్చగిరి, బిఆర్ఎస్ యూత్ మండల ప్రధాన కార్యదర్శి బోటిక ధనంజయ్, నల్ల బోగుల సతీష్, లోతుకుంట నాగార్జున,గురజాల నాగేష్,ఓర్సు ఇద్దయా,లోతుకుంట మత్స్యగిరి, వడ్డేపల్లి యాదగిరి, బుషిపాక సైదులు తదితరులు పాల్గొన్నారు.