ప్రైవేట్ టీచర్ల సంక్షేమానికి కృషి చేసే రాజకీయ పార్టీలకే మద్దతు
సూర్యాపేట ప్రతినిధి(జనంసాక్షి): ప్రైవేట్ టీచర్స్ సంక్షేమానికి కృషి చేసే రాజకీయ పార్టీలకే తమ మద్దతు ఉంటుందని తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు దోసపాటి వీరు అన్నారు.ఆదివారం జిల్లా కేంద్రంలోని బ్రిలియంట్ పాఠశాలలో సంఘ పట్టణ అధ్యక్షుడు వేదాసు కృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రైవేటు టీచర్స్ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడారు.ప్రైవేట్ టీచర్స్ కు ఉద్యోగ, ఆరోగ్య పథకాల్లో ప్రాముఖ్యత కల్పించి, అకాల మరణం చెందిన ప్రైవేటు టీచర్లకు పది లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలన్నారు. ప్రైవేటు ఉపాధ్యాయులపై జరిగే దాడులను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి కఠిన చర్య తీసుకోవాలని, ప్రైవేట్ టీచర్లపై దాడికి పాల్పడితే పాఠశాల యాజమాన్యమే బాధ్యత వహించాలన్నారు,పీఎఫ్ ఈఎస్ఐ సదుపాయాన్ని ప్రైవేట్ టీచర్లకు వర్తింపజేయాలని కోరారు. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలలో ప్రైవేటు టీచర్స్ కుటుంబాల ఓట్లు 23 వేల ఓట్లు ఉన్నాయని తెలిపారు. చాలీచాలని జీతాలతో ప్రైవేటు టీచర్లు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా నూతన కమిటీని ఎన్నుకున్నారు.అంతకుముందుఇటీవల హైదరాబాద్ లో ఆత్మహత్య చేసుకున్న ఉపాధ్యాయుడు వెంకటాచారి ఆత్మకు శాంతి చేకూరాలని మౌనం పాటించారు.ఈ కార్యక్రమంలో ప్రైవేట్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మకంటి ఉపేందర్, వర్కింగ్ ప్రెసిడెంట్ మేడబోయిన సోమరాజు, గౌరవాధ్యక్షులు బచ్చలకూరి జానయ్య, వీరమల్ల రాము, బొమ్మకంటి శేఖర్ గౌడ్, మహేష్ యాదవ్, బాలకృష్ణ, ఆరాల రమేష్ యాదవ్, పాల్వాయి వెంకట్, తుంగతుర్తి జనార్దన చారి, వసంత్, నాగరాజు, షఫీజ్, విజయ్ తదితరులు పాల్గొన్నారు