వాసవి కపుల్స్ క్లబ్ ఆధ్వర్యంలో శ్రీనివాస్ జన్మదిన వేడుకలు
సూర్యాపేట ప్రతినిధి(జనంసాక్షి): జిల్లా కేంద్రంలోని జమ్మిగడ్డ దత్తసాయి మందిరంలో ఆదివారం కపుల్స్ క్లబ్ మెంబర్ బజ్జూరి శ్రీనివాస్ జన్మదిన వేడుకలు వాసవి కపుల్స్ క్లబ్ అధ్యక్షుడు తొనుకునూరి సంతోష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకలలో భాగంగా ప్రూట్ కట్ చేసి సన్మానించి, జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భగవంతుడు శ్రీనివాస్ కి ఆయురారోగ్యాలు ప్రసాదించి మరిన్ని పుట్టినరోజు వేడుకలను జరుపుకోవాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ ఆర్సీలు కలకోట్ల లక్ష్మయ్య, రాచకొండ శ్రీనివాస్, క్యాబినెట్ సెక్రటరీ వీరెల్లి సతీష్ కుమార్ , జడ్సీ జూలకంటి నాగరాజు, సెక్రటరీ శ్రీనివాస్, ట్రెజరర్ ఉమేష్, గుండా శ్రీధర్,శింగిరికొండ రవీందర్, బండారు సత్యనారాయణ, పసుపర్తి కృష్ణమూర్తి, పబ్బతి వేణు, బిక్కుమళ్ల కృష్ణ, వెంపటి శబరి, మిట్టపల్లి రమేష్, మంచాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.