రామారెడ్డి ఆశా వర్కర్ల అరెస్ట్ !!
రామారెడ్డి సెప్టెంబర్ 11రామారెడ్డి పోలీస్ స్టేషన్ లో ఆశా వర్కర్లను అరెస్టు చేశారని ఆశాలు చెప్పారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా బతుకులు పడాలనే తపన కోసం సోమవారం రాజధాని హైదరాబాద్ వెళ్తుంటే ఆశ వర్కర్ల ను ఎక్కడికి అక్కడ అరెస్టు చేసి రామారెడ్డి పోలీస్ స్టేషన్కు తీసుకురావడం పోలీసుల పనితీరు బాగులేదని అన్నారు. ఆడపడుచులు, మహిళలు అనే ఇంగిత జ్ఞానం లేకుండా అరెస్టు చేయడంహే యమైన చర్యగా భావిస్తున్నామని అన్నారు. కనీస వేతనం పద్ధెనిమిది వేలు ఇవ్వాల ని సీఎం కేసీఆర్ ని అడిగేందుకు బయలుదేరితే ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తారని మండిపడ్డారు. రాత్రి పగలు లెక్క చేయకుండా విధులు నిర్వహిస్తున్నాం మాకు కనీస వేతనం పద్ధెనిమిది వేల వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అరెస్టు అయిన వారిలో అమల, ప్రమీల ,మంజుల ,వనిత ,లావణ్య, కవిత, లక్ష్మి, భూదేవి ,రుక్మిణి, అనిత ,ప్రవళిక ,కళావతి ,పద్మ అరుణ ,బాలలక్ష్మి ఉన్నారు.