నందివనపర్తిలో అంగరంగా వైభవంగా పోచమ్మ బోనాలు
-దేవాలయాలకు పోటెత్తిన భక్తులు
-తెలంగాణ ప్రజల ఆధ్యాత్మిక సంస్కృతికి బోనాల పండుగ ప్రతీకఅమ్మవారికి ఒడిబియ్యం, బోనాలు సమర్పించిన మహిళలుఆకట్టుకున్న శివసత్తుల పూనకాలు, పోతరాజుల విన్యాసాలుతెలంగాణ రాష్ట్ర సంస్కృతీ సంప్రదాయాల గుబాళింపు బోనాలు.బోనాల ఉత్సవాలు గ్రామాల్లో మతసామరస్యానికి చిహ్నాo
ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 10( జనంసాక్షి) తెలంగాణ ప్రజల ఆధ్యాత్మిక సంస్కృతికి బోనాల పండుగ ప్రతీక. ప్రకృతితో మమేకమై జీవించే వ్యవసాయ ఆధారిత సమాజ సాంప్రదాయ సామూహిక తాత్వికత, బోనాల పండుగ సందర్భంగా యాచారం మండలం నందివనపర్తి గ్రామంలో ఆదివారం పోచమ్మ తల్లి బోనాల జాతర భక్తిశ్రద్ధలతో కన్నుల పండువగా జరిగింది. బోనాల కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బి.ఎన్.రెడ్డి ట్రస్ట్ చైర్మన్ బిలకంటి శేఖర్ రెడ్డి, ఎస్సై వెంకటనారాయణ , మాజీ సర్పంచ్ రాజు నాయక్ , హాజరైనారు.ఈ తెల్లవారుజామున అమ్మవారికి ఆలయ అర్చకులు అభిషేకం నిర్వహించి.. తొలి బోనం సమర్పించారు.డప్పుచప్పుళ్ల మధ్య పోతరాజుల విన్యాసాలు, పూనకంతో శివ సత్తుల నృత్యాలతో వీది వీది తిరుగుతూ ఊరేగించారు.పోతరాజుల విన్యాసాల మధ్య యువకుల కేరింతలతో బోనాల జాతర అంగరంగ వైభవంగా జరిగింది.సంప్రదాయబద్ధంగా ముస్తాబైన మహిళలు నెత్తిన బోనాలతో బాజభజంత్రీల మధ్య ఊరేగింపుగా తరలివచ్చి అమ్మవార్లకు బోనం నైవేథ్యంగా సమర్పించి మొక్కులను చెల్లించుకున్నారు.సాయంత్రం వేలాదిగా భక్తులతో అమ్మవారి ఆలయాలు కిటకిటలాడాయి.ఈ ఏడాది వర్షాలు విస్తారంగా కురిపించి పంటలు బాగా పండించేలా చూడాలని, ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు మహిళలు తెలిపారు.అంటువ్యాధుల బారి నుంచి ప్రజలను కాపాడు తల్లీ అంటూ పోచమ్మను భక్తి శ్రద్ధలతో కొలిచారు. ఈ కార్యక్రమంలో బి.ఎన్.రెడ్డి ట్రస్ట్ చైర్మన్ బిలకంటి శేఖర్ రెడ్డి, మాజీ సర్పంచ్ రాజు నాయక్,ఎస్సై వెంకటనారాయణ,వార్డు సభ్యులు తెలగమళ్ళ అనితరవి,బండి ఉమారాణి అలెగ్జాండర్, మేకం శంకర్, ఓరుగంటి రాధిక శేఖర్, కొండూరి రామనాథం, మాది వార్డు సభ్యులు తెలగమల్ల ప్రవీణ్, కారోబార్ మహేందర్, జై భీమ్ యూత్ అధ్యక్షులు హరి ప్రసాద్,ఉపాధ్యక్షుడు పెరుమళ్ళ రాజు, యూత్ కార్యవర్గ సభ్యులు మాల సంఘం యువకులు, పెద్ద ఎత్తున పాల్గొన్నారు.